Pawan Kalyan Son: పవన్ కళ్యాణ్ కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా? ఫొటో వైరల్!

సింగపూర్ సమ్మర్ క్యాంప్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడి కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. అంతేకాకుండా నల్లటి పొగ ఎక్కువగా పీల్చడంతో మార్క్ శంకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

దీంతో విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ దంపతులు సింగపూర్ కు బయలుదేరారు. అలాగే చిరంజీవి దంపతులు కూడా వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం బాగానే ఉందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. పొగ ఎక్కువగా పీల్చడంతో టెస్ట్ లు చేశారని.. మరో మూడు రోజులు హాస్పిటల్ లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో మార్క్ శంకర్ కు సంబంధించిన ఫోటో నెట్టెంటా వైరల్ గా మారింది. ఆ ఫోటోలో మార్క్ శంకర్ చేతికి కట్టు వేసినట్లు కనిపిస్తుంది. అలాగే అతడు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. రెండు చేతులతో తంసప్ సింబల్ చూపించి.. తనకు బాగానే ఉంది అన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.

ఆ ఫోటో చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా ఫ్యాన్స్, జనసేన సైనికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మార్క్ శంకరును ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. ఇక పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని జనసేన నాయకులు, కార్యకర్తలు, సినీ అభిమానులు, మెగా ఫ్యాన్స్.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు

తరవాత కథనం