Allu Arjun Advocate: అల్లు అర్జున్ కేసు వాదించిన లాయర్ ఎవరో తెలుసా? స్నేహితుడి కోసం రంగంలోకి దిగిన శిల్పా రవి!

allu arjun advocate

పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. ఉదయం నుంచి నడుస్తున్న హైడ్రామాలో సాయంత్రానికి ఐకాన్ స్టార్‌కు బెయిల్ వచ్చింది. ఉదయం నుంచి ఈ కేసును ఫాలో అప్‌ చేస్తూ చివరి నిమిషంలో బెయిల్ తీసుకొచ్చిన లాయర్ ఎవరో తెలుసా?

అల్లు అర్జున్‌కు బెయిల్ తీసుకొచ్చిన లాయర్ పేరు నిరంజన్ రెడ్డి. ఈయన వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. జగన్ సీబీఐ, ఈడీ కేసుల్లో కూడా ఈయన వాదిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో కూడా వాదించి బెయిల్ తీసుకొచ్చారు. ఈయన ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు హీరో అయిపోయారు.

Niranjan reddy

హైప్రొఫైల్ కేసులను మాత్రమే నిరంజన్‌ రెడ్డి వాదిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కేసులు మాత్రమే వాదించే ఈయన అల్లు అర్జున్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ నుంచి బెయిల్ వచ్చే వారకు వాదించారు. క్వాష్ పిటిషన్ వాదనల సందర్భంగా కూడా నిరంజన్ రెడ్డి పీపీతో గట్టిగానే వాదించారు. అరెస్టు సంగతి చెప్పకుండా సైలెంట్‌గా సడెన్‌గా అరెస్టు చేశారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

సంక్లీష్టమైన కేసులను డీల్ చేయడంలో నిరంజన్ రెడ్డి దిట్ట. అందుకే చివరి నిమిషంలో నిరంజన్ రెడ్డిని అల్లు అర్జున్ రంగంలోకి దించారు. ఈయన న్యాయవాదిగానే కాకుండా నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆచార్య చిత్రాన్ని ఆయనే నిర్మించారు.

ఈ కేసులో నిరంజన్ రెడ్డిని తీసుకురావడంలో అల్లు అర్జన్ ఫ్రెండ్‌ శిల్పా రవికిషోర్ రెడ్డి పాత్ర ఉన్నట్టు ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతోంది. 2024 ఎన్నికల్లో శిల్పా రవి కోసం ప్రచారం చేశారు అల్లు అర్జున్. తర్వాత అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కేసుల్లో కూడా చిక్కుకున్నారు. ఇప్పుడు మిత్రుడి రుణాన్ని శిల్పా రవి ఇలా తీర్చుకున్నారని చర్చించుకుంటున్నారు.

శుక్రవారం అల్లు అర్జున్‌ అరెస్టు చేయడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని ఆయన ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. ఇవాళ అరెస్టు చేస్తే సాయంత్రం వరకు బెయిల్ రాకుంటే సోమవారం వరకు రాదనేది వారి భయం. అయితే నిరంజన్ రెడ్డి వాదనలతో ఆఖరి నిమిషంలో బెయిల్ వచ్చేలా చేశారని ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతున్నారు. అందుకే నిరంజన్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

డిసెంబర్‌ నాల్గో తేదీన పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. సినిమా చూసేందుకు వచ్చిన దిల్‌షుక్‌నగర్‌కు చెందిన భాస్కర్‌ ఫ్యామిలీ చిక్కుకుంది. ఇందులో భాస్కర్ భార్య మృతి చెందారు. కుమారుడు సాయి తేజ్‌ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఘటనపై అల్లు అర్జున్ కూడా స్పందించారు. బాధిత కుటుంబానికి పాతిక లక్షల సాయం చేస్తానంటూ ప్రకటించారు.

వివాదం సమసిపోయిందని అనుకున్న టైంలో అల్లు అర్జున్ అరెస్టు తెలుగు ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. పుష్పతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌ అరెస్టు దేశంలోనే సెన్సేషనల్ అయింది.

తరవాత కథనం