రేవంత్ ఫ్లవర్ కాదు ఫైర్ – మరి అర్జున్ బకరానా ?

రేవంత్ ఫ్లవర్ కాదు ఫైర్ - మరి అర్జున్ బకరానా ?

Allu Vs Revanth :  అల్లు అర్జున్ ను అరెస్టు చేసినప్పుడు చాలా మంది రేవంత్ రెడ్డి ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని కూడా ప్రశ్నించారు.కానీ అసెంబ్లీలో ఆయన స్పీచ్ చూసిన తర్వాత చాలా మంది రేవంత్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని అని పొగిడిస్తున్నారు. అప్పటికి ఇప్పటికి ఎందుకు మార్పు వచ్చింది. ..? 

అర్జున్ పై సానుభూతి అంతా పోయే!

అల్లు అర్జున్ అరెస్ట్ అయిన‌ప్పుడు 90 శాతం సానుభూతి వ్య‌క్తం చేశారు.  అరెస్ట్ చేసిన తీరు ఆక్షేప‌ణ‌గా ఉందంటూ బ‌హిరంగంగానే అభిప్రాయ‌ప‌డ్డారు.  రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ.. అల్లు అర్జున్ ను సమర్థిస్తూ చాలా మంది మాట్లాడారు. ఎంతగా మారిందంటే  సంధ్య ధియేట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన ఘ‌ట‌న అటు తిరిగి ఇటు తిరిగి అల్లు అర్జున్ కే సానుభూతిగా మారినట్లు అయింది. కానీ ఇప్పుడు ఏమయింది..అందరూ ఆయనను తిడుతున్నారు. అల్లు అర్జున్ ను యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు. ఎందుకిలా జరిగింది.

రేవంత్ , అక్బర్ ప్రకటనలతో ఫుల్ డ్యామేజీ

‘ఓ మ‌హిళ చ‌నిపోయింది అని తెలిసి కూడా అల్లు అర్జున్ మొత్తం సినిమా చూసే వెళ్లాడు. చ‌నిపోతే సినిమా హిట్టు అవుతుంద‌ని న‌వ్వుతూ అన్నాడు’ అనే మాట‌లు అక్బ‌రుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయం బలంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది.  ‘థియేట‌ర్ ద‌గ్గ‌ర‌కు రావొద్ద‌ని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ విన‌లేదు’ అని రేవంత్ రెడ్డి ప్రకటించడం వైరల్ గా మారింది. బెయిలు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ  అందరూ పలకరించడానికి వస్తున్నారని బలప్రదర్సన చేశారు.  ఇది చాలా మైనస్ అయింది.   అసలేం జరిగిందో రేవంత్ రెడ్డి,అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రకటనలు చేయడంతో అవి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కూడా అంతే. ఆ ప్రెస్ మీట్ ఎందుకు అన్న డౌటానుమానం చాలా మందికి వచ్చింది.ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏం మాట్లాడినా రివర్స్ లో వెళ్తుంది. మౌనంగా ఉండటం ఉత్తమం అని అందరూ అనుకున్నారు. కానీ తన ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతోందని ఆయన మీడియా ముందుకు వచ్చారు. అది మరింతగా వైల్డ్ ఫైర్ గా మారింది. 

ఈ ఎపిసోడ్ క్లియర్ సపోర్టు రేవంత్ రెడ్డి 

సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి ఇప్పుడు యునానిమస్ సపోర్టు లభిస్తోంది. బాధిత కుటుంబానికి సాయం చేస్తున్నట్లుగా ప్రకటించి చేయకపోవడం దగ్గర నుంచి ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ స్పందించిన తీరు కూడా చర్చనీయాంశం అయింది. ఆయన లాయర్లు పోలీసులపై నిందలేసి  బెయిల్ ఇప్పించారు . ఇప్పుడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. జరిగిన వ్యవహారాలన్నింటినీ బయట పెట్టారు. ఆయనకు నాలుగు వారాల తాత్కలిక బెయిల్ వచ్చింది. పూర్తి స్థాయి బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాల్సిన సమయంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. 

అల్లు అర్జున్ ను బకరాను చేసిన టీం

రేపో మాపో బెయిల్ ర‌ద్దు అవ్వొచ్చు. బ‌న్నీని మ‌ళ్లీ అరెస్ట్ చేయొచ్చు. ఈసారి.. రిమాండ్ కూ త‌ర‌లించొచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టుకు వెళ్తారన్న ప్రచారం జరిగింది కానీ.. వ్యూహాత్మకంగా కింది కోర్టులోనే తేల్చుకోవాలన్న ఉద్దేశంలోఉన్నారు. ఈ వ్యవహారం మొత్తంలో ఉద్దేశపూర్వక తప్పిదాలు చేసిన అర్జున్.. మునిగిపోతున్నారు. బకరా అవుతున్నారు. కానీ రేవంత్ మాత్రం చాలా వరకూ సానభూతి పొందుతున్నారు.

తరవాత కథనం