Revanth Reddy on Allu Arjun : అల్లు అర్జున్ కాలుపోయిందా, కన్నుపోయిందా.. ఇండస్ట్రీ వర్గాలు ఏం కోరుకుంటున్నారు – రేవంత్ రెడ్డి ఫైర్!

image credit: X

Revanth Reddy on Allu Arjun : పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో మాట్లాడారు. తన సమావేశాలకు కూడా వేల మంది, లక్షలమంది ప్రజలు తరలివచ్చారు కానీ వారిని సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడూ ఇలా తోసేయలేదన్నారు. ఇంత పెద్ద ఘటనకు కారణం అయిన హీరో మాత్రం తనకు విషయం తెలిసినా బాధితులకు సహాయం చేసే ప్రయత్నం చేయలేదు..వారి ప్రాణం పోయినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదున్నారు.

అక్బరుద్దీన్ మాటల్లో…

‘తన సినిమా ప్రీమియర్ షో చూసేందుకు ఓ స్టార్ హీరో హైదరాబాద్‌ సంధ్య థియేటర్ కు వచ్చారు. ఆ సమయంలో భారీగా ప్రేక్షకులు అటెండ్ అయ్యారు. ఈ టైమ్ లో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది. మరో ఇద్దరు స్పృహ కోల్పోయి పడిపోయారు.. అప్పుడు కూడా హీరో థియేటర్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. ఇదేనా పద్ధతి..సమాజానికి ఏం సందేశం ఇస్తారు? ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుంది అన్నారు..

అల్లు అర్జున్ రియాక్షన్ పై రేవంత్ రెడ్డి

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..కేసు కోర్టులో ఉంది.. డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో ఉందని సంధ్య థియేటర్ యాజమాన్యం రెండో తేదీనే చిక్కడపల్లి పోలీసులకు లెటర్ రాసింది. సంధ్య థియేటర్ చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఉన్నాయి.. ఓ సినిమా హీరో, హీరోయిన్లు వస్తే జనాలు భారీగా వస్తారు. అందుకే సినిమా నటులు రాకుండా చూసుకోవాలని చిక్కడపల్లి CI రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

తప్పు మీద తప్పు

మొదట చేసిన తప్పేంటంటే థియేటర్ వాళ్లు అడిగిన దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రోడ్ షో గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం మరో తప్పు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 8 నుంచి 10 థియేటర్లున్నాయి. అలాంటి దగ్గరు స్టార్ హీరోలు వస్తే సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినా రోడ్ షో చేశారు. కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ రావడంతో వేల మంది అభిమానులు దూసుకొచ్చారు. టికెట్లు ఉన్నవారితో పాటూ టికెట్లు లేనివాళ్లు కూడా దూసుకొచ్చారు. ఆ సమయంలో రేవతి కుటుంబం విడిపోయింది… రేవతి ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఊపిరాడక స్పృహ కోల్పోయారు. ప్రాణాలు పోతున్నా కుమారుడిని కాపాడుకునేందుకు ఆ తల్లి ప్రయత్నించింది. ప్రాణం పోయినా కానీ బాబుని వదిలిపెట్టలేదు.. ఆ తర్వాత CPR చేసి హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. అప్పటికే రేవతి మరణించింది. ఆమె కుమారుడు శ్రేతేజ్ బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లిపోయాడ.

శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని ఏసీపీ చెప్పినా హీరో కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు థియేటర్ నుంచి వెళ్లకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించడంతో అప్పుడు వెళ్లారు. ఆ సమయంలోనూ రూఫ్ టాప్ లోంచి ఫ్యాన్స్ కి చేతులు ఊపుతూ వెళ్లిపోయారు. ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉంటారా? ఓ తల్లి చనిపోయింది ఆమె కొడుకు హాస్పిటల్లో ఉంటే ఎవ్వరూ వెళ్లి పరామర్శించలేదు..

అల్లు అర్జున్ కు కాలు పోయిందా కన్ను పోయిందా..ఒక్కరాత్రి జైల్లో ఉండి వస్తే అందరూ క్యూ కట్టి పరామర్శించడం ఏంటి? ఇండస్ట్రీ వర్గాలు ఏం కోరుకుంటున్నారు? చావు బతుకుల్లో ఉన్న ఆ చిన్నారిని ఒక్కరూ పరామర్శించలేదు…ఇంత జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని, నన్ను బద్నాం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై అక్బరుద్దీన్ చెప్పినదంతా నిజమే అన్నారు రేవంత్ రెడ్డి.

తరవాత కథనం