శబరిమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. 2025 జనవరిలో 34 స్పెషల్ ట్రైన్స్ – మొత్తం వివరాలివే!

Image Credit: Pinterest

Sabarimala Special Trains : శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు శుభవార్త. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే..జనవరిలో మరో 34 అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఆ సర్వీసుల వివరాలివే…

Sabarimala Special Trains 2025

2025 జనవరి 3 నుంచి ఫిబ్రవరి 01 వరకూ ప్రత్యేక రైళ్ల రూట్లు ఇవే
హైదరాబాద్‌ – కొట్టాయం
కొట్టాయం – సికింద్రాబాద్‌
మౌలాలి – కొట్టాయం
కాచిగూడ – కొట్టాయం
మౌలాలి – కొల్లం

హైదరాబాద్‌ – కొట్టాయం – సికింద్రాబాద్‌ (07065/07066)

హైదరాబాద్ నుంచి బయలుదేరి లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్‌, తాండూరు… సేలం, కృష్ణ, రాయ్‌చూరు, మంత్రాలయం, ఆదోని, గుంతకల్‌, గుత్తి, కడప, రాజంపేట, రేణిగుంట, కోయంబత్తూర్‌, పాలక్కడ్‌, త్రిశ్శూర్‌, అలువ, ఎర్నాకుళం టౌన్‌ స్టేషన్ల మీదుగా వెళుతుంది. ప్రతి మగళవారం, బుధవారాల్లో మొత్తం 8 సర్వీసులుంటాయి.

మౌలాలి-కొట్టాయం – సికింద్రాబాద్‌ (07167/07168)

ఈ స్పెషల్ ట్రైన్ చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పెట్టై, సేలం, ఈరోడ్‌, తిరుప్పుర్‌, కోయంబత్తూర్‌, పాలక్కడ్‌, త్రిశ్శూర్‌, మీదుగా వెళుతుంది. ఈ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం, శనివారం ఉంటుంది.

కాచిగూడ -కొట్టాయం- కాచిగూడ (071/07170)

ప్రత్యేక రైళ్లు మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పెట్టై, సేలం, ఈరోడ్‌, తిరుప్పుర్‌, కోయంబత్తూరు, పాలక్కడ్‌, త్రిశ్శూరు, అలవు, ఎర్నాకుళం, ఎట్టుమానూర్‌ స్టేషన్ల మీదుగా ఆది, సోమ వారాల్లో సర్వీసులందించనున్నాయి.

మౌలాలి-కొల్లం- మౌలాలి (07170/07172)

మౌలాలి నుంచి బయలుదేరే ఈ స్పెషల్ ట్రైన్ భువనగిరి, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ఈరోడ్‌, తిరుప్పుర్‌, పొడన్నూరు, పాలక్కాడ్‌, నుంచి మరికొన్ని ప్రముఖ స్టేషన్లు దాటుకుంటూ కొట్టాయం, చెంగనస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్‌, కాయంకుళం నుంచి వెళుతుంది. ఈ స్పెషల్ ట్రైన్ ప్రతి శని, సోమవారాల్లో ఉంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్స్ లో ఏసీ బోగీలతో పాటూ..స్లీపర్, జనరల్ కోచ్ లు సైతం ఉంటాయని దక్షిణ మధ్యే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు.

అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 28 ప్రత్యేక రైళ్లు కేటాయించింది..ఇప్పుడు అదనంగా మరో 34 ప్రత్యేక రైళ్లు కేటాయించింది. అయ్యప్పమాలధారులు ప్రశాంతంగా వెళ్లి అయ్యప్పను దర్శించుకోవాలని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని ఈ ఏర్పాట్లు చేసింది. అందుకే నవంబరు, డిసెంబరు నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే.

అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః
హరి హర సుపుత్రాయ నమః
కరుణా సముద్రాయ నమః

స్వామియే శరణం అయ్యప్ప

తరవాత కథనం