Allu Arjun Arrest: సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్టయ్యాడు.. డిసెంబరు 13 మధ్యాహ్నం అరెస్ట్ చేసి చిక్కడపల్లి పీఎస్ కి తీసుకెళ్లి పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అనంతరం గాంధీ హాస్పిటల్ లో టెస్టుల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఇరువైపులా వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దాఖలు చేసుకోవాలని సూచనలు చేసింది. తనపై వేసిన కేసు కొట్టేయాలని కోరుతూ అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి… బన్నీ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది పలు అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు… ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి నిర్ణీత కాల వ్యవధితో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
బన్నీ అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్ వచ్చే దాదాపు ఆరు గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హోరెత్తిపోయింది. హ్యాష్ ట్యాగ్ అల్లు అర్జున్ బాగా ట్రెండ్ అయింది. రాజకీయ ప్రముఖల నుంచి సామాన్యుల వరకూ చాలామంది బన్నీకి సపోర్ట్ గా నిలిచారు. ఇదే సమయంలో ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయ్ అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు, ఆయా సందర్భాల్లో ఆ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయలేదని క్వశ్చన్స్ మారుమోగిపోయాయ్..
రేవంత్ పేరు అల్లు అర్జున్ ఇక మర్చిపోడు
ఈ మధ్య జరిగిన పుష్పా సినిమా సక్సెస్ మీట్ తో..తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పే సందర్భంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం అని ఆపేశారు. రేవంత్ రెడ్డి పేరు కాసేపు గుర్తురాలేదు..దీంతో నీళ్లు తాగేందుకు టైమ్ తీసుకుని ఆ తర్వాత రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయారనే కామెంట్స్ వచ్చాయ్. బన్నీ అరెస్టుకి ఆ కక్ష కూడా ఓ కారణం అనే ప్రచారం చేశారు. మరోవైపు BRS నేత, మాజీ హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు స్పందిస్తూ మరోసారి అల్లు అర్జున్ పేరు మర్చిపోడు అని రిప్లై ఇవ్వడం ఇది వైరల్ అవుతోంది.
గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట సంగతేంటి?
చంద్రబాబు ప్రభుత్వం హయాంలో2015 గోదావరి పుష్కరాల సమయంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. 52 మంది గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలమైంది. ఇప్పుడు సంధ్య థియేటర్ తొక్కిసలాటకు బన్నీని బాధ్యుడిని చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని ఎందుకు బాధ్యుడిగా అరెస్ట్ చేయలేదంటూ పోస్టులు పెట్టారు పలువురు నెటిజన్లు.
రేవంత్ సంగతేంటి
తొక్కిసలాట ఘటనలో బాధితులపై సానుభూతి ప్రకటించిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఈ ప్రభుత్వం ‘హైడ్రా’మా వల్ల సైకోసిస్‌తో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని ముందుగా అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
భోలే బాబాను వదిలేశారేం!
యూపీలోని హాథ్రస్ సత్సంగ్ లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది చిపోయారు. అప్పుడు భోలే బాబాను ఎందుకు బాధ్యుడిని చేయలేదు.. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్లందరీ ఓ న్యాయం బన్నీకి ఓ న్యాయమా అని క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్లు.
RGV వేసిన క్వశ్చన్స్ ఇవే!
అల్లు అర్జున్ కేసు గురించి కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు అంటూ సంధించాడు రామ్ గోపాల్ వర్మ. పుష్కరాలు , బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?, ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ? భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ,ప్రజా నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు ? అని క్వశ్చన్ చేశారు రామ్ గోపాల్ వర్మ…
ఇంకా చెప్పుకుంటూ వెళితే తొక్కిసలాటల్లో ప్రాణాలు కోల్పోయిన వారెందరో..అలాంటి ఘటనలెన్నో..ఇప్పటివరకూ ఇలాంటి ఘటనల్లో బాధితులకు పరిహారాలు ప్రకటించారు కానీ ఎవ్వరినీ బాధ్యులను చేసి అరెస్టు చేయలేదు..
ఈ అంశంపై పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వెళ్లలేదని..సెలబ్రెటీలు తప్పుచేసినా పోలీసులు చూస్తూ ఊరుకోరు అనే సందేశం పంపించేందుకే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని చెబుతున్నారు.
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!