మౌని అమావాస్య రోజున కుంభమేళాకు పోటెత్తిన భక్తులు- అర్ధరాత్రి తొక్కిసలాట- డజన్ల మంది మృతి – వందల మందికి గాయాలు

Mahakumbh Stampede:

Mahakumbh Stampede: ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ ప్రాంతంలో ఇవాళ (జనవరి 29) అర్థరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది. 1 గంటలకు మహాకుంభంలో సంగం ఒడ్డున తొక్కిసలాట జరిగింది. ఇందులో డజనుకుపైగా ప్రజలు మరణించారు. గాయపడిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని అంటున్నారు. అధికార యంత్రాంగం ఇంకా స్పష్టమైన గణాంకాలు వెల్లడించలేదు. ప్రమాదం జరిగిన తర్వాత బయటకు వచ్చిన చిత్రాలు హృదయవిదారకంగా ఉన్నాయి.ఘటనా స్థలంలో భక్తుల బట్టలు, బ్యాగులు, చెప్పుల కుప్పలు దర్శనమిచ్చాయి.

Image

ఈ ప్రమాదం జరిగినా ప్రాంతంలోనే జనం రద్దీ ఎక్కువగా ఉంది. లక్షల మంది భక్తులు సంగం ఘాట్‌కు చేరుకుంటున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని భక్తులకు అధికారులు సూచిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ఆలయ దర్శనాలను కూడా రద్దు చేశారు. అలహాబాద్‌లోనే స్నానాలు చేసి వెంటనే తిరిగి వెళ్లిపోవాలని భక్తులకు చెబుతున్నారు.

Image

జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చాలా మంది తమ ఆత్మీయులను వెతుక్కుంటూ కనిపిస్తున్నారు. అయిన వారి సమచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారు ఎంత మంది ఉన్నారో వారికి ఎక్కడ చికిత్స చేస్తున్నారో తెలియక కంగారు పడుతున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిందని, వారిని అదుపు చేయడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రజలు ఒకరినొకరు నెట్టుకొని స్నానాలకు యత్నించారని అంటున్నారు.

Image

మౌని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని సంగమంలో స్నానాలు చేసేందుకు సంగం వద్దకు చేరుకుంటున్న భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు బారికేడ్లు పెట్టారు. అయితే భారీగా తరలి వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయలేక వాటిని తొలగించారు. దీంతో ఇక్కడ భద్రతా ఏర్పాట్ల కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని నియమించారు.

Image

కుంభమేళా నిర్వాహకులు భద్రత విషయంలో జాగ్రత్తగానే ఉన్నారు. వేలాది మంది పోలీసులు, ఆర్పీఎఫ్, పీఏసీ సిబ్బందిని అక్కడ మోహరించారు. కుంభమేళా ప్రాంతాన్ని హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మహాకుంభంలో పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. అందుకే సాధారణ స్నానాలు కూడా ప్రారంభించారు. సంగంలోని అన్ని ఘాట్‌ల వద్ద స్నానాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎలాంటి పుకార్లు పట్టించుకోవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.

Image

తొక్కిసలాటపై బీజేపీ నాయకత్వం ఆరా తీసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి నేతలు ఫోన్లు చేశారు. ప్రధాని మోదీ రెండుసార్లు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాఫోన్లు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు సమీక్షించారు. భక్తులకు తక్షణమే సహాయ సహకారాలు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు.

Image

తొక్కిసలాట జరిగిన తర్వాత రైల్వే శాఖ రైళ్లు రద్దు చేసిందనే పుకార్లు ఎక్కువయ్యాయి. అయితే రైళ్లు రద్దు చేయలేదు కానీ రీ షెడ్యూల్‌లో చేసింది. జనవరి 29న ఇతర నగరాల నుంచి ప్రత్యేక రైలు ప్రయాగ్‌రాజ్‌కి రావడం లేదని ఈ రైళ్లన్నీ కుంభమేళాకు వచ్చిన వారిని వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాటు చేసినట్టు పేర్కొంది రైల్వేశాఖ.

ఈరోజు మహాకుంభంలో 7 నుంచి 8 కోట్ల మంది స్నానాలు చేస్తారని అంచనాతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళవారం సాయంత్రానికే ప్రయాగ్‌రాజ్ వీధులు జనంతో నిండిపోయాయి. అందుకే వీళ్లను తీసుకెళ్లేందుకు ప్రయాగ్‌రాజ్ స్టేషన్‌ నుంచి మొత్తం 360 రైళ్లు నడుస్తాయి.

తరవాత కథనం