Tabla Legend Zakir Hussain: నాన్నే నా తొలిగురువు – తబలా ఉస్తాద్ జాకిర్ హుసేన్ గురించి ఈ విషయాలు తెలుసా!

image credit: X

Zakir Hussain: అమెరికాలో నివసిస్తున్న ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడు జాకిర్ హుసేన్ కన్నుమూశారు. భారత ప్రభుత్వం జాకిర్ హుసేన్‌ను పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలతో సత్కరించింది. ఏడేళ్ల వయసునుంచే తబలా వాయించడం ప్రారంభించిన హుసేన్, హిందూస్థానీ సంగీతంలో పండితులైన ఎంతో మంది సంగీత కళాకారులతో కలిసి పని చేశారు. గ్రామీ అవార్డు గ్రహీత అయన జాకిర్ హుస్సనే.. ఏడుసార్లు ఆయన ఈ అవార్డులకు నామినేట్ అయి.. నాలుగుసార్లు అవార్డు గెలుచుకున్నారు. ‘గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్’కు గానూ 2009లో తొలిసారిగా గ్రామీ అవార్డు దుకున్నారు.
51వ గ్రామీ అవార్డుల్లో భాగంగా బెస్ట్ కాంటెంపరరీ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది.

2024లో 3 అవార్డులు
ఆ తర్వాత 2024 గ్రామీ అవార్డులలో కూడా 3 అవార్డులు సొంతం చేసుకున్నారు. బెస్ట్ కాంటెంపరరీ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ విభాగంలో ‘యాజ్ వుయ్ స్పీక్’, బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో ‘దిస్ మూమెంట్’, బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో ‘పాష్టో’‌లకు ఈ అవార్డులు అందుకున్నారు. మనం చేసిన చేసిన పనిని బట్టి అవార్డులు రావాలని నమ్ముతాను. గ్రామీ అవార్డు జ్యూరీలో అంతా కళాకారులే ఉంటారు..మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఈ అవార్డు మళ్లీ దక్కిందంటే.. నేను కొత్త యుగంలో దూసుకుపోతున్నానని అర్థం… లేదంటే ఈ వయసులో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ఇస్తారని సంతోషం వ్యక్తంచేశారు జాకిర్.

నాన్నే తొలి గురువు
12 ఏళ్ల వయసులో బడే గులాం అలీ, అమీర్‌ఖాన్‌, ఓంకార్‌నాథ్‌ ఠాకూర్‌తో కలిసి తబలా వాయించాను..16-17 ఏళ్లప్పుడు రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్‌తో కలిసి పని చేశారు..చిన్నతనంలోనే పెద్దలు, గురువులతో కలసి పనిచేసే అవకాశం దక్కింది..వారి నుంచి చాలా నేర్చుకున్నా..మా నాన్నగారు చాలా ప్రోత్సహించారు.. చిన్నప్పటి నుంచీ సంగీతంతో ఏర్పడిన బంధమే ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కళాకారులతో పనిచేసేలా చేసిందన్నారు జాకిర్ హుసేన్.తనపై తండ్రి ప్రభావం ఎక్కువ ఉందని చెప్పేవారు జాకిర్ హుసేన్. తనకు ప్రాథమిక శిక్షణ ఇచ్చింది తండ్రే అని ఆ తర్వాత వివిధ చోట్ల తబలా వాయించడం వల్ల ప్రముఖుల నుంచి స్ఫూర్తి పొందానని చెప్పుకొచ్చారు.

జాకిర్ హుసేన్‌ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు – ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

సంగీత నాటక అకాడమీ, గ్రామీ, పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ వంటి అనేక అవార్డులు అందుకున్న ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ జాకిర్ హుసేన్ మరణం రాష్ట్రానికి, కళారంగానికి తీరని లోటు – మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌.

కళారంగానికి ఆయన చేసిన సేవ అపూర్వమైనది. కళ పట్ల ఆయనకున్న నిబద్ధత, అంకితభావం, సహకారం చిరకాలం గుర్తుండిపోతాయి – బీజేపీ నేత నితిన్ గడ్కరీ

తరవాత కథనం