స్టార్ హీరోలు కాదు – అభిమానుల్ని దోచుకునే దొంగలు !

స్టార్ హీరోలు కాదు - అభిమానుల్ని దోచుకునే దొంగలు !

Star heros: హీరోలంటే తెర మీద నటించేవాళ్లు కాదు మీ జీవితాల్ని దారిలో పెడితుతున్న టీచర్లే. హీరోలుగా టీచర్లనే చూడండి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వ స్కూళ్లో జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో విద్యార్థులకు హితబోధ చేశారు. పవన్ చెప్పిన దాంట్లో వందకు వంద శాతం నిజం ఉంది. అసలు రోల్ మోడల్స్ హీరోలు కాదు. ఇంకా చెప్పాలంటే అభిమానాన్ని దోచుకునే దొంగలు. ఇది చెప్పడానికి కాస్త కటువుగా ఉంటుంది కానీ.. ఇది మాత్రం పచ్చి నిజం. దానికి వస్తున్న సినిమాలు వాటికి ఖరారు చేస్తున్న టిక్కెట్ తరలే కారణం.

ఓపెనింగ్స్ వచ్చేది అభిమానుల వల్లే

ఒక్క టిక్కెట్ వెయ్యి రూపాయలా.. నాకు ఏడాది మొత్తం ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. పుష్ప  కంటే దాని బాబులాంటి సినిమాల్ని చూస్తాను అని .. పుష్ప 2 టిక్కెట్ ప్రైసింగ్ గురించి ప్రకటన వచ్చిన తర్వాత ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఎవరికైనా అదే అనిపిస్తుంది. వెయ్యికిపైగా పెట్టి ఓ సినిమా చూసేంత సాధారణ ప్రేక్షకులకు ఉంటుందా .. చాన్సే లేదు. ఉండేది అభిమానులకే. అంటే అభిమానం ఉన్న వారిని దోచుకోవడమే. అభిమానుల్ని ఎవరైనా జాగ్రత్తగా చూసుకుంటారు. వారిని దోచుకోకూడదు. కానీ టాలీవుడ్ హీరోల స్టైల్ భిన్నం. తమ సినిమాకు ఎంత హైప్ వస్తే.. అంత ఎక్కువగా అభిమానుల్ని దోచేసుకుంటారు. ఆ మొత్తాన్ని రెమ్యూనరేషన్‌గా తీసేసుకుంటేూ ఉంటారు. ఇక్కడ పుష్ప హీరోకు రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. దీన్ని రాబట్టుకోవడానికి టిక్కెట్ చార్జీ వెయ్యి రూపాయలు చేస్తున్నారు. ఇది అభిమానుల్ని అడ్డగోలుగా దోచుకోవడం కాదా ?

రూ. 300 కోట్ల రెమ్యూనరేషన్ అభిమానుల రక్తమే !

అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని గొప్పగా చెబుతున్నారు. ఆయన మూడేళ్లు కష్టపడి పని చేశారని ఆ మొత్తం ఇవ్వలేదు. ఆయన అభిమానుల నుంచితొలి రోజు ఒక్కో టిక్కెట్‌కు వెయ్యి వరకూ పెట్టి టిక్కెట్ కొంటారని ఆ మొత్తం తిరిగి వస్తుందని ఇచ్చారు. తన కోసం ఫ్యాన్స్ అలా ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి తాను తీసుకుంటున్నానని ఆయన అనుకుంటారు. అంటే ఇదంతా అభిమానుల రక్తమే. ఓపెనింగ్‌లో రేట్లు తగ్గించే కాన్సెప్ట్ ను హీరోలు అమలు చేయాలి. ఎందుకంటే అభిమానులు తమ  కోసం ఎంతో సమయం వెచ్చిస్తున్నారు. హీరోల కోసం.. వారి సినిమాల కోసం మౌత్ టాక్ తెస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా వారికి ఉచితంగా కాకపోయినా అసలు రేట్లకయినా సినిమాలు చూసే అవకాశం కల్పించాలి. అంతే కానీ హీరోను అభిమానించడమే మీ ఖర్మ.. వేలకు వేలు కట్టుకోండి అని నిలువుదోపిడీ చేయడం కరెక్ట్ కాదు. కానీ విచిత్రంగా అందరు హీరోలు అదే చేస్తున్నారు. కొద్ది మంది హీరోలు మాత్రం తమ రెమ్యూనరేషన్ ను ఆకాశానికి ఎత్తకుండా.. ప్రారంభంలో రేట్లు పెంచకుండా చూసుకుంటున్నారు.

సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోతున్నారు !

ఒకప్పుడు తెలుగు యువతకు సినిమా అంటే తెలుగు సినిమా. ఇపుడు లెక్కలేనన్ని వినోదాలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే అందరూ హీరోలకు ఫ్యాన్స్ తగ్గిపోతున్నారు. సూపర్ స్టారిజం అనేది అంతమయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం తమను కూడా హీరోలు దోపిడీ చేస్తున్నారన్న భావనకు రావడమే. కాంబినేషన్లు సెట్ చేసి..క్రేజ్ వచ్చిందని సినిమాకు సినిమాకు దోపిడీ చేస్తే.. రేపటికి రోజున అసలు రేటు పెట్టినా చూసేందుకు ఎవరూ రాని పరిస్థితి వస్తుంది.  ఇప్పుడే అది కనిపిస్తోంది. అల్లు అర్జున్ సినిమాకు రెండో రోజే ఎందుకు కలెక్షన్లు లేవు ?. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సినిమాకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు లేవు. ఎందుకంటే ఓ సామాన్యుడు తన బడ్జెట్లో పెట్టలేనంత పెద్ద మొత్తంలో టిక్కెట్ రేట్లను ఖరారు చేశారు. దీనంతటికి కారణం ఎవరు ?

సినిమా బాగుంటే … వర్త్ అనుకుంటే చూస్తారు.. అభిమానుల్ని దోచుకోవడం కరెక్ట్ కాదు !

ఓ. సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుంది అనుకుంటే అందరూ చూస్తారు. తాము పెట్టే డబ్బులకు వర్తుగా ఎంటర్‌టెయిన్మెంట్‌ లభిస్తుందనుకుంటే పెట్టుకుంటారు. అంతే కానీ బలవంతంగా మొదట్లోనే ఓపెనింగ్స్ మొత్తాన్ని అభిమానుల దగ్గర దోచుకోవడం ఇవాళ కాకపోతే రేపైనా తేడా కొడుతుంది. హీరోలు ఆలోచించాల్సిందే.

తరవాత కథనం