Allu Arjun Case: సంధ్య థియేటర్ ఘటనపై విజయశాంతి రియాక్షన్.. రాములమ్మ సపోర్ట్ ఇండస్ట్రీకేనా!

Allu Arjun

Pushpa 2 Stampede Row: ఇండస్ట్రీలో – రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో కి వెళ్లిన రేవతి అనే మహిళా తొక్కిసలాటలో అక్కడికక్కడే మరణించడం దుమారం రేపింది. అల్లు అర్జున్ ప్రధానం కారణం అనే విమర్శలు వెల్లువెత్తున్నాయ్. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కామెంట్స్ మొదలు, పోలీసుల రియాక్షన్ వరకూ అల్లు అర్జున్ తప్పిదమే అని తేల్చి చెప్పేలా ఉన్నాయ్. సాక్ష్యాంగా సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా రిలీజ్ చేశారు పోలీసులు. ప్రస్తుతం రేవతి కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు..కోలుకుంటున్నాడని చెబుతున్నా ఎప్పటికి లేచి తిరగగలడు అనేది ప్రస్తుతానికి చెప్పలేం. ఇలాంటి టైమ్ లో సున్నితమైన అంశానికి పరిష్కార మార్గం ఆలోచించకుండా విపక్షాలు మరింత అగ్గి రాజేస్తున్నాయ్ అంటున్నారు నెటిజన్లు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి ఓ రోజు జైలులో ఉండొచ్చిన అల్లు అర్జున్..రేవతి కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చాడు. తమ ఇంటిపై రాళ్లదాడి జరిగిన తర్వాత స్పందించిన అల్లు అరవింద్..ఈ సమయంలో సంయమనం పాటించాలి ఆ పనే చేస్తున్నాం అన్నారు. అయితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. తన క్యారెక్టర్ తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందాడు..జరిగింది దురదృష్టకర ఘటన ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కనీసం తన మూవీ బిగ్గెస్ట్ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నా అని బాధపడ్డాడు. ఈ కామెంట్స్ కూడా పెద్ద దుమారం రేపాయ్. రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడుతాడని పోలీసులు ఫైర్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో బన్నీ బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేసేదిశగా అడుగుపడుతున్నాయ్ అనే టాక్ వినిపిస్తోంది.

వాస్తవానికి ఈ విషయం కూల్ గా పరిష్కారం అయ్యేదే కానీ.. రేవంత్ రెడ్డిపై ఉన్న వ్యతిరేతను ఎలా చూపించాలో అర్థంకాని BRS, BJP నేతలు అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నట్టే చేసి చలికాచుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఓ వేదికపై రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయాడంటూ కేటీఆర్ ప్రతి క్షణం రచ్చచేశారని..మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేసి చేసి అవి కుదరక ఇప్పుడు రూట్ మార్చి రేవంత్ ని కేటీఆర్ టార్గెట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.

ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి..సుదీర్ఘంగా ట్వీట్ చేశారు..

సంధ్య థియేటర్ సంఘటనపై స్పందించిన విజయశాంతి ఏమన్నారంటే..

ఓ సినిమా విడుదలైన సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణల విభజన రేఖలు తెచ్చేవరకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. గడిచిన రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్ లు అన్నీ కూడా భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. “ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉందాం” అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి.. ఇప్పుడు అలా కాకుండా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలని, ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కూడా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అటు తెలంగాణ ఇటు ఏపీ రాష్ట్రాలలోని బీజేపీ నేతల ప్రకటనలను బట్టి అర్ణమవుతోంది. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, బీజేపీ కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదంతా సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి అంటూ ట్వీట్ చేశారు విజయశాంతి .

విజయశాంతి ట్వీట్ ఇదే 

తరవాత కథనం