Bharat Ratna: తెలుగువారి నిండు గర్వం నందమూరి తారక రామారావు. ఆయన ఎప్పుడో భారతరత్నం కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు ఇప్పించవచ్చు కానీ ఇప్పించలేదు. ఎందుకో వారికో తెలుసు. ఇప్పుడు మరోసారి ఆయన కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. నిజానికి పొత్తులకు ముందు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటి్స్తారన్న ప్రచారం కానీ అనువైన సమయం కాదని ఆగిపోయారేమో కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఎన్టీఆర్ వర్థం లేదా జయంతి ఎప్పుడు జరిగినా చంద్రబాబు నోటి నుంచి ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తామన్న ప్రకటనలు మాత్రం వస్తున్నాయి. ఆయన అలా అంటున్నారంటే ఖచ్చితంగా వస్తుందని అర్థం. ఎందుకంటే ఇప్పుడు అది ఆయన చేతుల్లోనే ఉందని అనుకోవచ్చు.
ఎన్టీఆర్‌కు భారతరత్న – కేంద్రం కూడా సిద్ధమే!
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. వ్యతిరేకత కూడాలేదు. ఇంత కాలం పరిస్థితులు కలసి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు టీడీపీ చేతుల్లోఉన్నాయి. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కారణంగా తమ పార్టీ మూలపురుషుడికి ఆ గౌరవం ఇప్పించేందుకు ప్రయత్నించవచ్చు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. బీజేపీ కంటే ముందు కాంగ్రెస్ కు ఢీకొట్టిన దిగ్గజంగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అయితే సరైన టైమింగ్స్ కోసం.. కేంద్రం ఎందురు చూస్తుందని అనుకోవచ్చు.
పదే పదే భారత రత్న డిమాండ్ వినిపిస్తున్న చంద్రబాబు
ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో చంద్రబాబునాయుడు మరోసారి అదే డిమాండ్ చేశారు. భారతరత్న వచ్చేదాకా వదిలి పెట్టబోమన్నారు. ఆయన తల్చుకుంటే.. నెక్ట్స్ అవార్డుల ప్రకటన సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఉంటుంది. కానీ ఇక్కడ చాలా రచ్చ జరుగుతుంది. అలా ప్రకటిస్తే ఎన్టీఆర్ సతీమణి తానే అంటూ లక్ష్మిపార్వతి ముందుకొస్తారు. ఆమె చేసే రచ్చకు వైసీపీ మీడియా, సోషల్ మీడియా అదనంగా జత చేసే కంపును తట్టుకోవడం అసాధ్యమన్న అంచనాలు ఉన్నారు. ఈ కారణంతోనే ఆమెను వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చక్కదిద్దడానికి గత ఏడాది ఎన్టీఆర్ కాయిన్ విడుదల సందర్భంగా లక్ష్మిపార్వతిని ఆహ్వానించలేదు., ఆమె కుటుంబసభ్యురాలు కాదన్న భావన కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పని చేశారు.
నాలుగేళ్లలో ఎప్పుడైనా భారతరత్నం
వచ్చే నాలుగేళ్లలో ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఎన్టీఆర్ సిగలో భారతరత్నం చేరుతుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇప్పుడు చాన్స్ మిస్సయితే.. మళ్లీ అవకాశం కోసం ఎదురు చూడాల్సి ఉంటుందని.. చంద్రబాబు అంత చాయిస్ తీసుకోరని చెబుతున్నారు . చంద్రబాబు ప్రయత్నాలకు తన వంతు మద్దతు ఇవ్వడానికి పురందేశ్వరి కూడా రెడీగా ఉంటారు. నిజానికి గత ఏడాదే ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆగింది. ఈ సారి ఆగే చాన్స్ లేదు. అంటే భారతరత్నకు అడ్డం ఆయన చావుకు కారణం అయ్యారని టీడీపీ నేతలంతా విమర్శించే లక్ష్మిపార్వతినే. చనిపోయిన తర్వాత కూడా ఆయనను వదిలి పెట్టడం లేదని అంటున్నారు.