నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది – ఎగ్జాంపుల్ పేర్ని నాని !

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది - ఎగ్జాంపుల్ పేర్ని నాని !

Perni Nani:   పేర్ని నాని ప్రెస్ మీట్ పెడితే పవన్ కల్యాణ్‌కు దబిడి..దబిడే అని వైసీపీ నేతలు, సోషల్ మీడియా చాలా కాలం ట్రోల్ చేశారు. ఇప్పుడు తాను బయట కనిపిస్తే దబిడిదబిడే అనే భయంతో కుటుంబంతో సహా ఆయన కనిపించకుండా పోయారు. అతి కష్టం మీద రూ. రెండు కోట్లు ప్రభుత్వానికి కట్టి బిక్కు బిక్కుమంటూ తాను ఒక్కడే బయటకు వచ్చాడు. కానీ కుటుంబం మొత్తంపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయనకీ ఈ పరిస్థితి ఎందుకు ?. పేర్ని కృష్ణమూర్తి లాంటి పేరున్న నాయకుడు కొడుక్కి ఈ దుస్థితి ఎందుకు ? .  కారణం ఒక్కటే నోరు మంచిదైదే ఊరు మంచిదవుతుంది?

మాటకారితనం కాస్తా జగన్ కోసం బూతుల బారిన పడిన వైనం !

పేర్ని నాని సీనియర్ నేత. మంచి మాటకారి.  గతంలో ఆయన ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు.  వైఎస్ హయాం నుంచి కీలకగానే ఉన్నారు.  రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. కానీ ఎప్పుడూ గౌరవం పోగొట్టుకోలేదు. కానీ పదేళ్ల కాలంలో మాత్రం ఆయన దిగజారిపోయారు.  పేర్ని నాని సొంతంగా ఎదగలేదు. ఆయన రాజకీయ వారసుడిగానే తెరపైకి వచ్చారు.    నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మంత్రివర్గంలో పేర్ని కృష్ణమూర్తి అనే మంత్రి ఉండేవారు. ఆయన చనిపోవడంతో ఆయన కుమారుడు పేర్ని వెంకట్రామయ్యకు రాజకీయ భవిష్యత్ లభిచింది. ఆ పేర్ని కృష్ణమూర్తికి మచిలీపట్నం ప్రాంతంలో మంచి పేరు ఉంది.  కానీ  ఆయన కుమారుడు వెంకట్రామయ్యే ఈ పేర్ని నాని.  తండ్రి పేరును సైతం అందరూ అసహ్యించుకునేలా పదేళ్లు రాజకీయం చేశారు.

పవన్‌పై జగన్ బూతుల అస్త్రం పేర్ని నాని

కొడాలి నానిని చంద్రబాబుతో ఎలా తిట్టించారో.. పవన్ ను పేర్ని నానితో అలా తిట్టించారు.  తండ్రి చనిపోయిన తర్వాత మచిలీపట్నం సీటు  పేర్ని నానికి ఇవ్వాలని అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రయత్నించారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించారు. కానీ నేదురుమల్లి ఆయనకే టిక్కెట్ ఇప్పించారు. కానీ వైఎస్ వర్గీయులు వ్యతిరేకంగా పోటీ చేసి పేర్ని నాని మొదచి సారి ఓడించారు. ఇదంతా ఆయనకు తెలుసు… తర్వాత వైఎస్ పంచన చేరారు. ఆ కుటుంబానికి పెద్ద పాలేరునని చెప్పుకుని..  చులకన అయిపోయారు.ఇప్పుడుజగన్ నమ్ముకుని కుటుంబంతో సహా పరారు కావాల్సి వచ్చింది.  

బియ్యం మాయం కేసులో లుకౌట్ నోటీసులు 

ఇప్పుడు ఈ పేర్ని నాని అధికారం పోయేసరికి  తాను చేసిన అక్రమాలు, అవినీతి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక పరారయ్యారు. బియ్యం స్కాంలో ఆయన పాత్ర కూడా కీలకంగా మారింది. తన భార్య పేరుతో గోడౌన్లు నిర్మించి అందులో పౌరసరఫరాలశాఖ శాఖ బియ్యం పెట్టించి వాటిని కొట్టేశారు. మళ్లీ వైసీపీ గెలిచి ఉంటే ఎవరూ అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మొత్తం బయటపడింది. దీంతో తన భార్యను అరెస్టు చేస్తారన్న భయంతో ఆయన భార్యను.. ఎన్నికల్లో పోటీ చేసిన కుమారుడు కిట్టును తీసుకుని ఖరారయ్యాయి. బియ్యానికి డబ్బులు ఇస్తానని చెక్కు పంపించారు.  ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. తన గోడౌన్‌లో బియ్యం మాయమయ్యాయని ఆయన పారిపోవాల్సిన పని లేదు. ప్రభుత్వంతో.. పౌరసరఫరాల శాఖతో పద్దతిగా మాట్లాడి పరిష్కారం చేసుకోవచ్చు., పారిపోవడం ఎందుకు ?.  ఎందుకంటే ఆయన నాడు అలా ప్రవర్తించారు కాబట్టి నేడు అధికారంలో ఉన్న వాళ్లు క్షమించే ప్రశ్నే ఉండదన్నభయంతో పారిపోయాడు. అంటే తాను తప్పు చేశానని ఆయనకు బాగా తెలుసు. 

పద్దతిగా రాజకీయం చేసి ఉంటే ఇంత టార్గెట్ అయ్యేవాడా? 

తెలిసి కూడా తప్పు చేసి ఇప్పుడు పారిపోవడం లీడర్ల లక్షణం కాదు. జగన్ మోహన్ రెడ్డి ఏదో లబ్ది చేకూరుస్తారని ఆశపడి చేయకూడనన్ని తప్పుడు చేశారు. ఇప్పుడు ఇతర పార్టీలకు టార్గెట్ అయి పరారయ్యారు. జగన్ మోహన్ రెడ్డి రెడ్డి మాత్రం హాయిగా అయితే బెంగళూరు లేకపోతే హైదరాబాద్ లో రిలాక్స్ అవుతున్నారు.  పేర్ని నాని ఇంతలా భయపడటానికి మరో కారణం కొల్లు రవీంద్రను  కుట్ర పూరితంగా హత్య కేసులో ఇరికించి జైలుకు పంపడం. అందుకముందు పదేళ్లు కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్నా మచిలీపట్నంలో వైసీపీ కార్యకర్తలు, పేర్ని నాని ధైర్యంగా రాజకీయాలు చేశారు. తప్పుడు కేసులు పెట్టలేదు. కానీ పేర్ని నాని మాత్రం ఆయనపై తప్పుడు హత్య కేసు పెట్టి జైలుకు పంపారు. మరి ఇప్పుడు టీడీపీ కూటమి ఊరుకుంటుందా?.  అందుకే పరారవ్వాల్సి వచ్చింది. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే.. అధికారం ఉందని మిడిసిపడకూడదు. నోరు మంచిగా ఉంచుకుని ఊరుని కూడా మంచిగా ఉంచుకోవాలి. 

తరవాత కథనం