2025లో జరిగే మొదటి క్రికెట్ మ్యాచ్ ఇదే- భారత్ తొలి మ్యాచ్‌ ఎప్పుడో తెలుసా?

Image Source BCCI

2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నారు జనం. కొత్త ఏడాది 2025కి ఎన్నో ఆశయాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో క్రీడాభిమానులు కూడా 2025లో జరిగే టోర్నీలు, ఈవెంట్ల గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు మరింత ఎక్కువగా వెతుకుతున్నారు. వచ్చే ఏడాది ఇండియా డే మ్యాచ్‌లు ఏంటని ఆలోచిస్తున్నారు.  అందుకే అలాంటి వివరాలును ఈ స్టోరీలో చూద్దాం.

వచ్చే ఏడాది జరిగే మొదటి మ్యాచ్ అదే 

వచ్చే ఏడాది మొదటి మ్యాచ్‌ ఆఫ్ఘనిస్థాన్‌ జింబాంబ్వే మధ్య జరగనుంది. ఈ రెండు దేశాల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ జనవరి రెండో తేదీన ప్రారంభంకానుంది. బులావోలోని క్వీన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో మ్యాజ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభంకానుంది. ఆఫ్ఘనిస్థాని డిసెంబర్‌ 11 నుంచే జింబాంబ్వేలో పర్యటించనుంది. ముందుగా మూడు టీ ట్వంటీలు తర్వాత మూడు వన్డేలు ఆడనుంది. చివరిలో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

అదే రోజు శ్రీలంక న్యూజిలాండ్ మద్య మూడో టీ 20 జరగనుంది. డిసెంబర్‌ 28 నుంచే న్యూజిలాండ్‌లో శ్రీలంక పర్యటించనుంది. మొదటి రెండు టీ 20లు 2024 డిసెంబర్ ఆఖరిలో ఆడనుంది. ఈ టూర్‌లో న్యూజిలాండ్‌తో శ్రీలంక మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది.

2025లో భారత్ తన మొదటి మ్యాచ్ ఎప్పుడు ఆడనుంది.
ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న భారత్‌ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులను ఆడనుంది. భారత్‌ టెస్టు మ్యాచ్‌తోనే తన 2025 జర్నీ ప్రారంభించనుంది. ఐదో టెస్టు మ్యాచ్‌ను సిడ్నీలో జనవరి మూడు నుంచి ప్రారంభంకానుంది. తర్వాత భారత్‌ ఇండియాకు తిరుగు పయనం కానుంది

భారత్‌లో ఇంగ్లండ్‌ టూర్

జనవరి 22 నుంచి భారత్‌లో ఇంగ్లండ్ పర్యటించనుంది. జనవరి 22న ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్‌ కోల్‌కతా ఇడెన్ గార్డెన్‌లో జరగనుంది. రెండోది జనవరి 25న చెన్నైలో జరగనుంది.  జనవరి 28న మూడోది రాజ్‌కోట్‌లో ఆడనున్నారు.  నాల్గోది జనవరి 31న పూణెలో జరుగుతుంది. ఐదో టీ 20 ఫిబ్రవరి 2న ముంబైలో ఆడతారు. ఈ పర్యటనలో భాగంగా తొలి వన్డే భారత్ ఇంగ్లండ్‌ మధ్య నాగపూర్‌లో ఫిబ్రవరి 6న జరగనుంది. రెండో వన్డే ఫిబ్రవరి 9న రెండో వన్డే, ఫిబ్రవరి 12న మూడే వన్డే ఆడతారు.

ఇండియా టెస్ట్‌ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో ఆడుతుందా?

జూన్‌ 11న టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. అప్పటి వరకు టాప్‌లో ఉన్న రెండు దేశాలు ఈ ఫైనల్ ఆడతాయి. అనంతరం భారత్‌ ఆడే మ్యాచ్‌ల వివరాలు ఇక్కడ చూడొచ్చు

జూన్‌లో ఇంగ్లండ్‌లో భారత్ టూర్‌

  • జూన్ 20 నుంచి లీడ్స్‌లో తొలి టెస్టు మ్యాచ్‌
  • 2 జులై నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో రెండో టెస్టు
  • పది జులై నుంచి లార్డ్స్‌లో భారత్‌, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు
  • జులై 23 నుంచి మాంచెస్టర్‌లో నాల్గో టెస్టు మ్యాచ్‌
  • 31 జులై నుంచి లండన్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్

ఛాంపియన్ ట్రోఫీ ఎప్పుడు

ఛాంపియన్ ట్రోఫీని కూడా భారత్ ఆడనుంది. దీనికి సంబంధించిన వెన్యూ ఇంకా ఫిక్స్ కాలేదు. అనంతరం షెడ్యూల్ ప్రకటించనున్నారు. అది పిబ్రవరిలో ఉంటుందని అంటున్నారు. అలా అయితే ఇప్పుడు షెడ్యూల్ మారుతుంది. టీమిండియా మరో టెస్టు ఆడాల్సి ఉంటుంది.

ఫిబ్రవరిలో జరిగే ఛాన్స్ 

ఫిబ్రవరిలో 15 తర్వాత ఈ ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  భారత్‌కు ఫిబ్రవరి 15 నుంచి జూన్ వరకు షెడ్యూల్ ఖాళీగా ఉంది. మార్చి చివరిలో ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఈ మధ్యలోనే ఛాంపియన్ ట్రోఫీ పూర్తి చేయనున్నారు.

తరవాత కథనం