Axar Patel: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్

ఐపీఎల్ 2025 సీజన్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన క్రికెటర్ బ్యాటింగ్ చూస్తామని ఉత్కంఠగా ఉన్నారు. ఇదంతా ఓకేత్తయితే ఐపీఎల్ ప్రారంభం కావడానికి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది.

ఆ జట్టుకు ఇంకా కెప్టెన్ ని నియమించకపోవడమే అందుకు కారణం. ఢిల్లీ కెప్టెన్ గా ఎవరుంటారు అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ క్యాపిటల్ యాజమాన్యం అదిరిపోయే సర్ప్రైజ్ అందించింది. అందరి ఉత్కంఠకు తెర పడింది. ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న పేరే ప్రకటించబడింది. అక్సర్ పటేల్ ను ఢిల్లీ క్యాపిటల్ కొత్త కెప్టెన్గా యాజమాన్యం నియమించింది. ఇక గత సీజన్ వరకు ఢిల్లీ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ఈ సీజన్లో లక్నో జట్టుకు వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఈసారి వేలంలో ఢిల్లీ జట్టులోకి కొత్తగా కేఎల్ రాహుల్ వచ్చాడు.

దీంతో ఢిల్లీ కెప్టెన్ పరిశీలనలో కేఎల్ రాహుల్ పేరు అక్షర పటేల్ పేరు వినిపించింది. కానీ ఇదివరకే లక్నో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఇప్పుడు ఢిల్లీ కెప్టెన్సీ చేపట్టడానికి ఆసక్తి చూపించలేదని.. అందుకే ఆ జుట్టు పగ్గాలను అక్షర పటేల్ కు యాజమాన్యం అందించబోతుందని జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు యాజమాన్యం అదే విషయాన్ని ప్రకటించింది. అక్షర పటేల్ ని జట్టు కెప్టెన్ గా నియమించింది

తరవాత కథనం