ఐపీఎల్ 2025 సీజన్ సందడి సందడిగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు ఓటమిపాలైంది. సొంత గడ్డపై 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మొదట టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. 51 బంతుల్లో 77 పరుగులు చేసి అదరగొట్టేసాడు. అందులో మూడు సిక్స్ లు, ఆరు ఫోర్ లు ఉన్నాయి. అలాగే అభిషేక్ పోరేల్ 20 బంతుల్లో 33 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
అందులో ఒక సిక్స్, నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి. అక్షర పటేల్ 14 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అలాగే సమీర్ రిజ్వి 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఇలా మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
దీంతో ఈ లక్ష్య చేదనకు దిగిన సీఎస్కే టార్గెట్ పూర్తి చేయలేక ఓటమిపాలయ్యింది. 184 పరుగుల చేధనలో చెన్నై జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే జట్టులో విజయశంకర్ దుమ్ము దులిపేశాడు. 54 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అందులో ఒక సిక్స్ ఐదు ఫోర్లు ఉన్నాయి. ఈ బ్యాటర్ ఒక్కడే పోరాడడంతో సీఎస్కే విజయం సాధించలేకపోయింది.
రచిన్ రవీంద్ర 3 పరుగులు, డేవాన్ కాన్వే 13 పరుగులు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు, శివం దుబే 18 పరుగులు, రవీంద్ర జడేజా రెండు పరుగులు చేశారు. చివరగా ఎంఎస్ ధోని 26 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అందులో ఒక ఫోర్ ఒక సిక్స్ ఉంది. సీఎస్కే జట్టు బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో విజయం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సొంతమైంది.