Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీపై సెహ్వాగ్ సంచలన కామెంట్స్.. ప్రశంసిస్తున్న ఫ్యాన్స్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ను ఓడించి టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ ఆఖరిపోరు ఎంతో ఉత్కంఠగా జరిగింది. ఒకానొక సమయంలో టీమిండియా గెలుస్తుందా? అనే అనుమానాలు లేవనెత్తాయి. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో 9 నెలల్లోనే రెండు ట్రోఫీలు వచ్చాయి.

చాంపియన్స్ ట్రోఫీకి ముందు టి20 ప్రపంచ కప్ ను రోహిత్ సారధ్యంలో భారత్ కు దక్కింది. అతడి సారధ్యంలోనే గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్ వరకు దూసుకెల్లగలిగారు. దీంతో అతడి కెప్టెన్సీ తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. రోహిత్ కెప్టెన్సీ పై ప్రశంసలు జల్లు కురిపించాడు.

రోహిత్ ను అభినందించాడు. రోహిత్ సారథిగా వ్యవహరించిన తీరు అత్యద్భుతమైన కొనియాడాడు. చాలామంది రోహిత్ శర్మ కెప్టెన్సీ ని తక్కువ అంచనా వేశారని.. కానీ అతడు వరుసగా రెండు ట్రోఫీలను దేశానికి అందించాడని తెలిపాడు. ఎంఎస్ ధోని తర్వాత రోహిత్ నిలిచాడని చెప్పాడు. అతడు బౌలర్లను వినియోగించుకునే తీరు అలాగే టీం ను హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుందని అన్నాడు.

ఇక రిజర్వ్ బెంచికే పరిమితమైన ప్లేయర్లతో మాట్లాడే విధానం అద్భుతమని పేర్కొన్నాడు. తొలి మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ను కాదని హర్షిత్ రానాకు ఛాన్స్ ఇచ్చాడని.. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తికి అవకాశం కల్పించాడని అన్నారు. ఆ సమయంలో తుది జట్టులో ప్లేస్ రాని వారిని సముదాయించడంలో రోహిత్ సక్సెస్ అయ్యాడని.. అదే అతడిని అత్యుత్తమ కెప్టెన్ గా నిలిపిందని పేర్కొన్నాడు.

ఒక విధంగా చెప్పాలంటే రోహిత్ తన గురించి తాను చాలా తక్కువగా ఆలోచిస్తాడని.. ముఖ్యంగా జట్టు కోసం సహచరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తాడని తెలిపారు. ఎవరైనా అభద్రతాభావంతో ఉంటే వారు అలా ఉండకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటాడని తెలిపాడు. ఇలా జట్టును అన్ని విధాల చూసుకుంటూ ముందుకు పోవడంలో రోహిత్ సక్సెస్ అయ్యాడని తెలిపారు.

తరవాత కథనం