Champions Trophy 2025 Tickets: ఛాంపియన్స్ ట్రోఫీకి టిక్కెట్లు ఎలా పొందాలి?

champions trophy (Source ICC)

Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ అభిమానలు ఎంతగానో ఎదురు చూస్తు్నారు. ఈ మధ్య షెడ్యూల్ కూడా వచ్చింది. ఈ టోర్నీ పాకిస్థాన్‌లో జరుగుతున్నప్పటికీ భారత్‌ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడబోతోంది. పాకిస్థాన్ వెళ్లబోమని టీమిండియా చెప్పడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ మోడల్‌లో నిర్హిస్తోంది.

టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడాన్ని పాకిస్థాన్ మొదట్లో పూర్తిగా వ్యతిరేకించినా టోర్నా ఆగిపోతుందని గ్రహించి ఓకే చెప్పింది. ఐసీసీ ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. దీనిపై బీసీసీఐ, పీసీబీ మధ్య ప్రత్యేక ఒప్పందం కూడా కుదిరింది. 2027 వరకు ఏ ఐసిసి టోర్నమెంట్‌ల కోసం కూడా ఒకరి దేశంలో ఇంకొకరు సందర్శించబోరని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అలాంటి మ్యాచ్‌ ఏమి ఉన్నప్పటికీ అన్ని కూడా తటస్థ వేదికలపైనే జరుగుతాయని స్పష్టం చేసింది.

షెడ్యూలు కూడా వచ్చిన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు టికెట్ల కోసం వెతుకుతున్నారు. ఇంకా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభంకానప్పటికీ వారి ప్రయత్నం వాళ్లు చేస్తున్నారు. అందుకే ఐసీసీ ప్రత్యేక పోర్టల్ తీసుకొచ్చింది. ఇందులో టికెట్లు కావాల్సిన వాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. తమ పేరు, ఇమెయిల్, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, నివాసం, ఇష్టమైన జట్టు పేరు చెప్పాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, టిక్కెట్ విక్రయాలు ప్రారంభమైన వెంటనే అప్‌డేట్‌లు అందుతాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న పాకిస్థాన్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. లీగ్ దశలో టీం ఇండియా మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో ఢీ కొట్టనుంది. టీమ్ ఇండియా నాకౌట్ దశకు చేరుకుంటే మరికొన్ని మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 4న మొదటి సెమీఫైనల్ ఉంటుంది. అందులో గెలిస్తే మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆడనుంది.

పూర్తి షెడ్యూల్ ఇదే

ఫిబ్రవరి 19 –  పాకిస్థాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్, నేషనల్ స్టేడియం, కరాచీ
ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ vs భారత్ మ్యాచ్, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ vs సౌతాఫ్రికా మ్యాచ్, నేషనల్ స్టేడియం, కరాచీ
ఫిబ్రవరి 22 – ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ మ్యాచ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్
ఫిబ్రవరి 23- పాకిస్థాన్ vs భారత్ మ్యాచ్, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ మ్యాచ్, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా మ్యాచ్, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
ఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ మ్యాచ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్
ఫిబ్రవరి 27- పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ మ్యాచ్, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
ఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్
మార్చి 01- దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ మ్యాచ్, నేషనల్ స్టేడియం, కరాచీ
మార్చి 02- న్యూజిలాండ్ vs భారత్ మ్యాచ్, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
మార్చి 04- TBC vs TBC, 1వ సెమీ-ఫైనల్ (A1 v B2) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
మార్చి 05- TBC vs TBC, 2వ సెమీ-ఫైనల్ (B1 v A2) గడ్డాఫీ స్టేడియం, లాహోర్
మార్చి 09- TBC vs TBC, ఫైనల్ మ్యాచ్

తరవాత కథనం