ind vs eng: భారత్ ఘన విజయం.. చెలరేగిన టీమిండియా ప్లేయర్లు.. ఎవరు ఎన్ని కొట్టారంటే!

ind vs eng

భారత్- ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ముగిసింది. టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్విప్ చేసింది. మూడో మ్యాచ్ నిన్న అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ను టీమిండియా 142 పరుగులు తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్స్ శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫామెన్స్ చేశారు.

ఈ మ్యాచ్లో ఆఫ్ సెంచరీ పైగా పరుగులు చేసి అదరగొట్టేశారు. తొలి వన్డే నుంచి కూడా మంచి ఫామ్ కొనసాగించిన భారత్.. చివరి మ్యాచ్ వరకు అదే కనబరిచింది. ఇందులో శుభమన్ గిల్ 102 బంతుల్లో 112 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అందులో 14 ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి. ఇక శ్రేయస్ అయ్యర్ సైతం తన ఫామ్ కనబరిచాడు. 64 బంతుల్లో 78 పరుగులు చేసి ఆహా అనిపించాడు.

అందులో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్ లు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు కోహ్లీ ఫామ్ లో లేడని చాలామంది విమర్శించారు. కానీ ఈ మ్యాచ్ తో విరాట్ సైతం ఫామ్ లోకి వచ్చేసాడు. 55 బంతుల్లో 52 పరుగులు చేసి అదరగొట్టేసాడు. 7 ఫోర్లు ఒక సిక్స్ తో చెలరేగిపోయాడు. మొత్తంగా భారత్ 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది.

ఈ భారీ లక్ష చేదనకు దిగిన ఇంగ్లాండ్ సగంలోనే చేతులెత్తేసింది. భారత్ బౌలర్లు దాటికి ఇంగ్లాండ్ చిత్తుచిత్తు అయిపోయింది. కేవలం 34.2 ఓవర్లలో 214 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. భారత్ బౌలర్లు అర్షదీప్ రెండు వికెట్లు, హర్షిత్ రానా రెండు వికెట్లు, అక్షర పటేల్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశారు.

తరవాత కథనం