ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్తో ఉత్కంఠ పోరు మధ్య గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. గెలుపు కైవసం చేసుకునే ముందు ఈ ట్రోఫీ భారత జట్టును ఒత్తిడికి గురిచేసింది. అభిమానులను కంగారు పెట్టించింది. సాఫీగా సాగుతున్న చేధనను సంక్లిష్టంగా మార్చింది.
అనంతరం గెలుపు పై అనుమానాలను రేకెత్తించింది. భారత్ గెలుస్తుందా? అనే ఆసక్తిని అనుమానాలను అందరిలోనూ కలిగించింది. చివరికి భారత్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఉత్కంఠ భరితమైన ఫైనల్ మ్యాచ్లో తడబడి నిలబడిన టీమిండియా చివరికి న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సగర్వంగా ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఎంతోమంది భారతీయ క్రికెట్ అభిమానులను మురిపించింది.
మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులు చేసింది. భారత్ స్పిన్నర్ల మ్యాజిక్ తో కివిస్ అతలాకుతలమైంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ ధావన్ తమ స్పిన్ తో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించారు. స్టార్ బ్యాటర్లందరినీ పెవిలియన్కు చేర్పించారు. అయితే కివీస్ బ్యాటర్లలో డారెల్ మిచెల్, బ్రేక్ వెల్ హాఫ్ సెంచరీలతో నిలిచారు.
మిగతా వారంతా చేతులెత్తేశారు. దీంతో మొత్తంగా కివిస్ 251 పరుగులు చేసింది. ఇక ఈ పరుగులను అలవోకగా చేదిస్తుంది అనుకున్న భారత్ చిక్కుల్లో పడింది. 100 పరుగుల వరకు ఒక్క వికెట్ కోల్పోకుండా ఆడిన భారత్ ఒక్కసారిగా కుదుపునకు గురైంది. చక చకా మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో సింగిల్స్ తీయడం కూడా కష్టంగా మారింది.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ తో చెలరేగాడు. 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక శుభమన్ గిల్ కూడా తక్కువ సమయంలో చేరాడు. పోనీ విరాట్ కోహ్లీ ఉన్నాడులే అనుకునే సమయానికి ఒక్క పరుగుతో అవుట్ అయ్యాడు. దీంతో భారత్ చిక్కుల్లో పడింది. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ ఆపద్బాంధవుడు అయ్యాడు.
ఆ తర్వాత అక్షర పటేల్, హార్దిక్ పాండ్యా చేసిన పరుగులు భారత్ ను కాస్త ఒడ్డెక్కించాయి. చివరకు కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ అద్భుతంగా నిలిచింది. ఇక జడేజా ఫోర్త్ తో ఇన్నింగ్ ను ముగించేసాడు. ఇలా ఆల్రౌండర్ ప్రదర్శన చేసిన టీమిండియా అజేయంగా కప్పును అందుకుంది.