ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ నడుస్తోంది. పలు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ కొనసాగుతోంది. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లు చూసేందుకు వస్తారు. అందులోనూ ఎక్కువ మంది అభిమానులు ధోనీ ఆటను చూసేందుకే వస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ధోని ఆట చూసేందుకు ఎంతో మంది తరలి వస్తారు.
అతడు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగితే చూద్దామని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. అంతేకాకుండా ధోని సిక్స్‌లు, ఫోర్లు కొడితే హోరెత్తించాలని సంబరపడుతుంటారు. అందుకు తగ్గట్టే మైదానాలు మార్మోగిపోతుంటాయి. ధోని అంతటి క్రేజ్ ఉంది మరి. అయితే ధోని చెన్నైకి కెప్టెన్‌గా వీడ్కోలు పలికిన తర్వాత.. రుతురాత్ గైక్వాడ్ ఆ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ధోనీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ రాబోతుంది. ధోనీ చెన్నై జట్టుకు కెప్టెన్సీ చేసే అవకాశం మరోసారి రాబోతున్నట్లు తెలుస్తోంది. అవును మీరు విన్నది నిజమే. ఏప్రిల్ 5న అంటే రేపు సొంత మైదానంలో దిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ధోనీ కెప్టెన్సీ వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దానికీ ఓ బలమైన కారణం కనిపిస్తోంది.
లాస్ట్ మ్యాచ్‌లో చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డ సంగతి తెలిసిందే. అతడు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని తెలుస్తోంది. అందువల్లే అతడికి బదులు కెప్టెన్‌గా ధోనీ రాబోతున్నట్లు తెలిసింది. తాజాగా రుతురాజ్ గాయంపై ఆ టీం బ్యాటింగ్ కోచ్ హస్సీ రియాక్ట్ అయ్యాడు. రుతురాత్ ఆడుతాడా? లేదా అనేది మ్యాచ్ రోజే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఒకవేళ ఈ మ్యాచ్కు రుతురాజ్ దూరమైతే.. కెప్టెన్‌గా ఎవరు ఉంటారు అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. స్టంప్స్ వెనకలా చురుగ్గా కదిలే ఓ ‘యువకుడికి’అంటూ తెలిపాడు. దీంతో అది ధోనీనే అని అంతా ఫిక్స్ అయిపోయారు. దీని బట్టి ధోనీ కెప్టెన్‌గా మరోసారి మ్యాచ్ చూసే అవకాశం లభిస్తుందని అభిమానులు ఖుష్ అవుతున్నారు.