Virat Kohli: కోహ్లీ కాకుండా RCB కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. మొత్తం చెప్పేసిన తోటి ప్లేయర్!

వరుసగా 17 ఏళ్లుగా టైటిల్ కోసం తహతహలాడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ ఐపీఎల్‌లో రజత్ పాటిదార్ సారథ్యంలో అడుగుపెట్టనుంది. గత ఏడాది మెగా వేలంలో డుప్లెసిస్‌ను జట్టులోకి తీసుకోలేేదు. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు మూడేళ్లపాటు జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆర్సీబీ యాజమాన్యం మళ్లీ వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కెప్టెన్సీ కోసం కోరింది.

కానీ కోహ్లీ మాత్రం దానికి నిరాకరించాడు. దీనిపై RCB వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌కు బదులుగా పాటిదార్‌ని ఎందుకు కెప్టెన్‌గా చేసారో అతడు చెప్పాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో జితేష్ మాట్లాడుతూ.. ఈ విషయం గురించి తెలిపాడు. ఆర్సీబీకి రజత్ పాటిదార్‌ కెప్టెన్‌ అయ్యాడని అందరూ తెలుసుకున్నప్పుడే తనకు తెలిసింది అన్నాడు. విరాట్ భాయ్ జట్టుకు కెప్టెన్‌గా ఉండాలనుకోలేదని అతడు అన్నాడు.

జితేష్ ఇంకా మాట్లాడుతూ.. అయితే కోహ్లీ కెప్టెన్‌గా ఎందుకు ఉండకూడదనుకున్నాడో తనకు కూడా తెలియదని అన్నాడు. అదంతా ఆయన వ్యక్తిగతం అని.. దానతో తనకు సంబంధం లేదని అన్నాడు. విరాట్ గత రెండు-మూడేళ్లుగా కెప్టెన్సీ చేయకపోవడంతో ఈ ఏడాది కూడా అదే పని చేయడని అనుకున్నానన్నాడు.

అందుకే తన అభిప్రాయం ప్రకారం కెప్టెన్సీకి రజత్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకొచ్చాడు. రజత్ కచ్చితంగా కెప్టెన్ అవ్వాలని.. ఈ ఆటగాడు చాలా ఏళ్లుగా RCBకి సేవలు అందించాడని తెలిపాడు. రజత్‌తో కలిసి చాలా మ్యాచ్‌లు ఆడాను అని పేర్కొన్నాడు. అందువల్లనే కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌కు తప్పకుండా సహాయం చేస్తాను అని చెప్పుకొచ్చాడు.

మెగా వేలంలో జితేష్ రూ.11 కోట్లు

గతేడాది జరిగిన మెగా వేలంలో ఆర్సీబీ రూ.11 కోట్ల భారీ మొత్తానికి జితేష్‌ను కొనుగోలు చేసింది. జితేష్ గతంలో పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడు. పంజాబ్ కూడా అతని కోసం రైట్ టు మ్యాచ్ కార్డ్‌ని ఉపయోగించింది. అయితే చివరికి RCB అతని స్థానంలో దినేష్ కార్తీక్‌తో నిర్ణయం తీసుకుంది.

తరవాత కథనం