ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో తొలిసారి ఓ మ్యాచ్ వరుణుడి ఖాతాలో పడింది. కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య నిన్న ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ మధ్యలోనే వరుణుడి ప్రతాపంతో ఆగిపోయింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ అదరగొట్టేసింది. ఓపెనర్లు దుమ్ము దులిపే సారు. నిర్దేశించిన 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేశారు. ఓపెనర్లు సిమ్రాన్ సింగ్, ప్రయంస్ ఆర్య మొదటి నుంచి దూకుడుగా ఆడారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో విజృంభించారు.
9 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 74 పరుగులు చేశారు. ఆ తర్వాత నుంచి ఆర్య చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలతో చితక్కోట్టేసాడు. ఆ తర్వాత ప్రభు సిమ్రాన్ సైతం ఫామ్ లోకి వచ్చేసాడు. అయితే అతడు స్పీడుకు వరుణ్ చక్రవర్తి కళ్లెం వేశాడు. దీంతో ప్రభు సిమ్రాన్ 49 బంతుల్లో 83 పరుగులు రాబట్టి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఓపెనర్ ప్రియంస్ ఆర్య కూడా అవుట్ అయ్యాడు. అతడు 35 బందుల్లో 69 పరుగులు చేశాడు.
అప్పటికి వీరిద్దరి హాఫ్ సెంచరీలతో స్కోర్ భారీగా ఉంది. కానీ వీరు ఎప్పుడైతే ఔట్ అయ్యారో అప్పట్నుంచి స్కోర్ బాగా డౌన్ అయింది. క్రీజ్ లోకి వచ్చిన మాక్స్వెల్ 7 పరుగులకి వెనుతిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 బంతుల్లో 25 పరుగులు రాబట్టి నాటౌట్ గా నిలిచాడు. ఇలా మొత్తంగా 201 పరుగులు చేశారు.
ఈ లక్ష్య చేదనకు దిగిన కేకేఆర్ మొదటి ఓవర్లో 0 వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది. మొదటి ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత వర్షం మొదలైంది. విపరీతమైన గాలి వర్షంతో మైదానం అల్లకల్లోలం అయింది. కవర్లను కప్పడం కూడా కష్టతరమైంది. ఇక వర్షం ఎంతకి తగ్గకపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభం కాలేదు. దీంతో చెరో జుట్టుకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లతో నాలుగో ప్లేసులో ఉంది. కేకేఆర్ ఏడు పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది.