CSK VS KKR: సొంత గడ్డపై చెన్నై ఢమాల్.. కోల్‌కతా ఘన విజయం

కెప్టెన్ మారినా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలరాత మారలేదు. రుతురాజు గైక్వాడ్ సారధ్యంలో వరుస ఓటములను ఎదుర్కొన్న సీఎస్కే ఇటీవల అతడు తప్పుకోవడంతో ధోనికి కెప్టెన్సీ పగ్గాలు అందాయి. ఇకనుంచి సీఎస్కే ధోని సాధ్యంలో వరుస విజయాలు అందుకుంటుందని అభిమానులు ఫుల్ కుష్ అయ్యారు. కానీ తాజాగా జరిగిన మ్యాచ్ చూస్తే అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది. మొదటి కంటే ఇప్పుడు మరింత దారుణంగా ఓడిపోయింది.

సీఎస్కే బ్యాటర్లు సొంత గడ్డపై పూర్తిగా తేలిపోయారు. కోల్కత్తా తో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఘోర పరాజయం చవి చూసింది. నిన్న కోల్కత్తా తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. మొదట్నుంచి సీఎస్కే జట్టు తడబడుతూ ఆడింది. సొంత పిచ్ అయినా కేకేఆర్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయారు. ఓపెనర్ కాన్వే 12 పరుగులు, రచిన్ రవీంద్ర 4 పరుగులకు పెవిలియన్కు చేరారు.

విజయ శంకర్ 21 బంతుల్లో 29 పరుగులు, రాహుల్ త్రిపాటి 16 పరుగులు తో స్కోర్ ను కాస్త ముందుకు నడిపించారు. సీఎస్కే జట్టులో శివం దుబే ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడు 29 బంతుల్లో 31 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఇలా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ స్కోరు చూస్తే కేకేఆర్ జట్టు బౌలర్లు ఎలా చెలరేగిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సునీల్ నరేన్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, హర్షిత్ రానా 2 వికెట్లు తీసి సీఎస్కేను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఇక ఈ లక్ష్య చేదనకు దిగిన కేకేఆర్ జట్టు అలవోకగా టార్గెట్ చేదించింది. ఓపెనర్లు డికాక్, సునీల్ నరేన్ మెరుపు షాట్లతో స్కోర్ బోర్డ్ ను పరిగెట్టించారు.

కేవలం 10.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. సునీల్ నరేన్ 18 బంతుల్లో 44 పరుగులు చేశాడు. డికాక్ 16 బంతుల్లో 23 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కెప్టెన్ రహేనా 17 బంతుల్లో 20 పరుగులు సాధించాడు. ఇలా కేకేఆర్ జట్టు సీఎస్కే సాధించిన లక్ష్యాన్ని అలవోకగా చేదించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో సీఎస్కే జట్టు వరుసగా ఐదో పరాజయం మూటగట్టుకుంది.

తరవాత కథనం