Major Dhyan Chand Khel Ratna and Arjuna Award 2024: జాతీయ క్రీడా అవార్డులు 2024ను భారత ప్రభుత్వంలోని యువజన వ్యవహారాలు అండ్ క్రీడల మంత్రిత్వ శాఖ ఈరోజు (జనవరి 2) ప్రకటించింది. 17 జనవరి 2025 (శుక్రవారం) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక వేడుకలో అవార్డు విజేతలకు ఇస్తారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడా అవార్డులను అథ్లెట్లు అందుకుంటారు. ఈసారి నలుగురు ఆటగాళ్లకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు.
అర్జున అవార్డు పొందిన 32 మంది ఆటగాళ్లలో 17 మంది పారా అథ్లెట్లు ఉండటంతో ఈసారి వారి వాహ కొనసాగింది. ఇది ఇప్పటి వరకు రికార్డుగా క్రీడానిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది మంచి పరిణామంగా అభివర్ణిస్తున్నారు.
మను భాకర్, డి గుకేష్ సహా నలుగురు ఆటగాళ్లకు ఖేల్ రత్న లభించింది. మను భాకర్, డి గుకేష్‌తో పాటు హాకీ ప్లేయర్ ‘సర్పంచ్ సాహెబ్’ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్లేయర్ ప్రవీణ్ కుమార్‌కి ఖేల్ రత్న అవార్డు వరించింది. ఈసారి పారాథ్లెట్ నవదీప్ కూడా అర్జున అవార్డు అందుకున్నాడు. పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రో కారణంగా వెలుగులోకి వచ్చారు.
ఈసారి క్రికెటర్ల పేర్లు లేకుండా పోయింది.
ఈసారి ఖేల్ రత్న, ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుల్లో ఏ క్రికెట్ ప్లేయర్‌ను చేర్చలేదు. ఇది ఆశ్చర్యంగా ఉంది. అదే సమయంలో క్రికెట్‌తో సంబంధం ఉన్న ఏ వ్యక్తి పేరును కోచ్ కేటగిరీలో చేర్చలేదు. గతసారి క్రికెట్‌లో మహ్మద్ షమీకి అర్జున అవార్డు లభించింది. ఇల్లూరి అజయ్‌కుమార్‌రెడ్డి గతేడాది అంధుల క్రికెట్‌లో అర్జున అవార్డు అందుకున్నారు. అటువంటి పరిస్థితిలో ఈసారి ధ్యాన్ చంద్ర అవార్డు లేదా ఖేల్ రత్న అవార్డును ఒక్క క్రికెటర్ కూడా అందుకోకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 అందుకున్నన ప్లేయర్లు
1. డి గుకేష్ (చెస్)
2. హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
3. ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్)
4. మను భాకర్ (షూటింగ్)
1: మను భాకర్: పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను తొలి కాంస్యాన్ని గెలుచుకుంది. సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్‌లో రెండో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విధంగా, ఈ విశ్వక్రీడల్లో ఒకే సీజన్‌లో రెండు పతకాలు సాధించిన భారత మొదటి క్రీడాకారిణిగా నిలిచింది.
2: డి గుకేశ్: దొమ్మరాజు గుకేష్ (డి గుకేష్) చెస్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. 2024లో చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ రూపంలో కొత్త రోల్ మోడల్‌గా అవతరించాడు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి కొత్త ఛాంపియన్‌గా నిలిచాడు.
3: హర్మన్‌ప్రీత్ సింగ్: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ద్వారా వెలుగులోకి వచ్చాడు హర్మన్‌ప్రీత్. ‘సర్పంచ్ సాహెబ్’ సారథ్యంలోని భారత జట్టు ఒలింపిక్స్‌లో మూడవ స్థానాన్ని పొందింది. అలాగే FIH బెస్ట్ మేల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు.
4: ప్రవీణ్ కుమార్: పారాథ్లెట్ ప్రవీణ్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల హైజంప్-T64 ఈవెంట్‌లో ప్రవీణ్ ఆసియా రికార్డును బద్దలు కొట్టి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
ఖేల్ రత్న, అర్జున అవార్డుతో ఏం ఇస్తారు
ఖేల్ రత్న అవార్డు గ్రహీతకు మెడల్, ప్రశంసా పత్రం, రూ. 25 లక్షల నగదు లభిస్తుంది. అర్జున అవార్డుతో రూ. 15 లక్షల నగదు, ఒక అర్జున్ విగ్రహం లభిస్తుంది. ఈ విజేతాల్లో భారత్ మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేత మురళీకాంత్ పెట్కర్. ఆయన 1972 పారాలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. 1965లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో వీరమరణంపై ‘చందు ఛాంపియన్’ చిత్రం రూపొందింది.
అర్జున అవార్డు ఎవరికి వచ్చింది
1. జ్యోతి యారాజీ (అథ్లెటిక్స్)
2. అన్ను రాణి (అథ్లెటిక్స్)
3. నీతు (బాక్సింగ్)
4. స్వీటీ (బాక్సింగ్)
5. వంటికా అగర్వాల్ (చెస్)
6. సలీమా టెటే (హాకీ)
7. అభిషేక్ (హాకీ)
8. సంజయ్ (హాకీ)
9. జర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
10. సుఖ్‌జిత్ సింగ్ (హాకీ)
11. రాకేష్ కుమార్ (పారా ఆర్చరీ)
12. ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్)
13. జీవన్‌జీ దీప్తి (పారా అథ్లెటిక్స్)
14. అజిత్ సింగ్ (పారా అథ్లెటిక్స్)
15. సచిన్ సర్జేరావ్ ఖిలారీ (పారా అథ్లెటిక్స్)
16. ధరంబీర్ (పారా అథ్లెటిక్స్)
17. ప్రణబ్ సుర్మా (పారా అథ్లెటిక్స్)
18. హెచ్ హొకాటో సెమా (పారా అథ్లెటిక్స్)
19. సిమ్రాన్ జీ (పారా అథ్లెటిక్స్)
20. నవదీప్ (పారా అథ్లెటిక్స్)
21. నితేష్ కుమార్ (పారా బ్యాడ్మింటన్)
22. తులసిమతి మురుగేషన్ (పారా బ్యాడ్మింటన్)
23. నిత్య శ్రీ సుమతీ శివన్ (పారా బ్యాడ్మింటన్)
24. మనీషా రాందాస్ (పారా బ్యాడ్మింటన్)
25. కపిల్ పర్మార్ (పారా జూడో)
26. మోనా అగర్వాల్ (పారా షూటింగ్)
27. రుబీనా ఫ్రాన్సిస్ (పారా షూటింగ్)
28. స్వప్నిల్ సురేష్ కుసలే (షూటింగ్)
29. సరబ్జోత్ సింగ్ (షూటింగ్)
30. అభయ్ సింగ్ (స్క్వాష్)
31. సజన్ ప్రకాష్ (ఈత)
32. అమన్ (కుస్తీ)
క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శనకు అర్జున అవార్డు (లైఫ్ ఎచీవ్‌మెంట్)
1. సుచా సింగ్ (అథ్లెటిక్స్)
2. మురళీకాంత్ రాజారాం పేట్కర్ (పారా-స్విమ్మింగ్)
ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరీ)
1. సుభాష్ రాణా (పారా-షూటింగ్)
2. దీపాలి దేశ్‌పాండే (షూటింగ్)
3. సందీప్ సాంగ్వాన్ (హాకీ)
ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌టైం కేటగిరి)
1. ఎస్. మురళీధరన్ (బ్యాడ్మింటన్)
2. అర్మాండో ఆగ్నెల్లో కొలాకో (ఫుట్‌బాల్)
జాతీయ క్రీడా ప్రమోషన్ అవార్డు
1. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా