ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ధోనీ రిటర్మెంట్ పై ఊహగానాలు వినిపించాయి. అతడు ఢిల్లీతో మ్యాచ్ జరిగిన తర్వాత ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోరుగా ప్రచారం సాగింది.
అందుకు ప్రధాన కారణం ధోని తల్లిదండ్రులు అని తెలుస్తోంది. చెపాక్ వేదికగా ఢిల్లీతో మ్యాచ్ ను ధోని తల్లిదండ్రులు, భార్య, కూతురు చూడ్డానికి వచ్చారు. అదే ఇప్పుడు ధోని రిటైర్మెంట్ వార్తలకు బలం చేకూర్చింది. ఎందుకంటే సాధారణంగా వారు మ్యాచ్లు చూడడానికి క్రికెట్ స్టేడియానికి రారు. కానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ చూడ్డానికి వారు స్టేడియంకి రావడంతో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు పుట్టుకొచ్చాయి.
ఇక మ్యాచ్ అనంతరం ధోని ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా తన ఐపీఎల్ రిటర్మెంట్ పై ధోని అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. తన రిటర్మెంట్ వార్తలను ఖండించాడు. ఈ సీజన్ పూర్తయ్యే వరకు ఐపీఎల్ కు గుడ్ బాయ్ చెప్పేదే లేదని ఆయన పేర్కొన్నాడు.
ఇప్పటికిప్పుడు ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించలేనని తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్నానని ఈ విషయంపై ఏడాదికి ఒకసారి సమీక్షించుకుంటా అని తెలిపాడు. ప్రస్తుతం తనకు 43 ఏళ్లని.. జూలైలో 44వ ఏడాదిలోకి అడుగుపెడతానని అన్నాడు. అయితే క్రికెట్ ఇంకా ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి తనకు పది నెలలు సమయం ఉందని చెప్పుకొచ్చాడు. తన రిటైర్మెంట్ ప్రకటించేది తాను కాదని.. తన శరీరమని అన్నాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గగా మారాయి.