ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 హోరాహోరీగా జరుగుతుంది. ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగానే నిన్న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టును చిత్తు చేసి 5వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
మొదట్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ క్రీజులో వచ్చారు. మంచి ఊపు మీద వచ్చిన ఓపెనర్లు చేతులెత్తేశారు. వరుస వికెట్లు కోల్పోయారు. మొదటి ఓవర్లో 0 వికెట్ నష్టానికి రెండు పరుగులు సాధించిన సన్రైజర్స్ జట్టు.. రెండవ ఓవర్ కు తొలి వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్ లో రెండో వికెట్, నాలుగో ఓవర్ లో మూడో వికెట్, ఐదో ఓవర్ లో నాలుగో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
దీంతో పవర్ ప్లే ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టానికి 24 పరుగుల చేసింది. దీపక్ చాహర్, బౌల్ట్ తమ అద్భుతమైన బౌలింగ్ తో సన్రైజర్స్ కు చెమటలు పట్టించారు. ఒకానొక సమయంలో srh జట్టు 100 పరుగులు అయినా చేస్తుందా అనే డౌట్ అందరిలోనూ కలిగింది. కానీ ఆ జుట్టుకు వెన్నెముకగా క్లాస్సేన్ నిలిచాడు. ఎవరు ఉన్నా లేకున్నా తానున్నానంటూ స్కోర్ను ముందుకు నడిపించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు.
అతడు శ్రమించడంతో హైదరాబాద్ జట్టు మంచి స్కోర్ చేయగలిగింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. హెడ్ 0 పరుగులు, ఇషాన్ కిషన్ 1 పరుగు, నితీష్ కుమార్ రెడ్డి 2 పరుగులు, అభిషేక్ శర్మ 8 పరుగులు, అనికేత్ త్ వర్మ 12 పరుగులు, అభినవ్ మనోహర్ 43 పరుగులు, క్లాసెన్ 71 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ అలవోకగా చేదించింది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ సత్త చాటడంతో ముంబై జట్టు 15.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి టార్గెట్ ఛేధించింది. రోహిత్ శర్మ 46 బంతుల్లో 70 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 19 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విల్ జాక్స్ 19 బంతుల్లో 22 పరుగులు చేశాడు.