PAK Vs NZ: కివీస్‌ చేతిలో పాకిస్థాన్ పరాభవం.. దంచికొట్టిన లేథమ్, యంగ్!

పాకిస్తాన్ ఆతిథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ లెవెల్ లో నిన్న ప్రారంభమైంది. తొలి మ్యాచ్ పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దాదాపు 60 పరుగులు తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు దుమ్ము దులిపేసింది.

ఇన్నింగ్స్ ను పేవలంగా ఆరంభించినా ఘనంగా ముగించింది. లేథమ్, యంగ్ ప్లేయర్లు చెరో సెంచరీతో అదరగొట్టేసారు. లేథమ్ అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు. 104 బంతుల్లో 118 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక విల్ యంగ్ 113 బంతుల్లో 107 పరుగులు చేసి అబ్బురు పరిచాడు.

వీరిద్దరూ రెండు సెంచరీలు చేయడంతో కివీస్ 5 వికెట్ల నష్టానికి 320 పరుగుల స్కోర్ చేసింది. అలాగే గ్లెన్ ఫిలిప్స్ సైతం అదరగొట్టేసాడు. 39 బంతుల్లో 61 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ తేలిపోయింది. ప్రారంభం నుంచి పేవలమైన ఆట తీరు కనబరిచింది.

10 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు మాత్రమే చేసింది. షకీల్ ఆరు పరుగులు, రిజ్వాన్ మూడు పరుగులు తో వెనుతిరిగారు. పాకిస్తాన్ జట్టులో కుష్ దిల్ షా మాత్రమే 49 బంతుల్లో 69 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బాబర్ అజాం 90 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. ఇలా పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో మొదటి మ్యాచ్ ను కివిస్ సొంతం చేసుకుంది.

తరవాత కథనం