Viral News: క్రికెట్‌కు సినిమా పరిశ్రమకు విడిపోని బంధం ఎప్పటి నుంచో ఉంది. విరాట్ కోహ్లీ సహా ఇలా చాలా మంది సినిమా నటులనే పెళ్లి చేసుకున్నారు. మరికొందరు మోడలింగ్‌లో ఉన్న వాళ్లతో జట్టు కట్టారు. వారు మోడలింగ్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లు సినిమాల్లోకి వచ్చిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. అందుకే క్రికెట్‌ను సినిమాలను వేరు చేసి చూడలేం.
ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కొందరైతే… అంతకు మించిన వాళ్లపై పుకార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. క్రష్‌ల గురించి చెప్పాల్సిన పనే లేదు. ప్రతి క్రికెటర్‌కి, లేదా సినిమా నటులకు క్రష్ ఒకరిపై మరొకరికి క్రష్ ఉండనే ఉంటుంది. అలాంటి ఓ వన్‌సైడ్ లవ్ స్టోరీని ఇప్పుడు చూద్దాం.
సినిమా హీరోయిన్లు ప్రేమించేది కేవలం మన ఇండియన్ క్రికెటర్లకే కాదు.. చాలా మంది ఫారెనర్స్ కూడా ఇలాంటి ప్రేమ వ్యవహారాలు నడిపారు. చాలా మంది విదేశీ క్రికెటర్ల మనుసులను మన బాలీవుడ్ హీరోయిన్స్ దోచుకున్నారు. చాలా మంది ఫారెన్ ప్లేయర్లకు మన బాలీవుడ్ హిరోయిన్ క్రష్‌లు ఉన్నారు. అలాంటి క్రికెటర్లలో ఒకరే పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.
ఆన్‌ఫీల్డ్‌లో ఎంత అగ్రెసివ్‌గా కనిపిస్తాడో షోయబ్ అక్తర్ ఆఫ్‌ఫీల్డ్ అంత రొమాంటిక్ పర్శన్. అలాంటి వ్యక్తి ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్‌ను చూసి ప్రేమలో పెడ్డాడు. ఆమె మన తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఆమె ఎవరో కాదు సోనాలి బింద్రే. అప్పట్లో విరివిగా భారత్ పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతుండేవి ఆ సందర్భంలో తన మనసులో మాట చెప్పేవారట.
బాలీవుడ్ నటి సోనాలి బింద్రే అంటే ఇష్టమని చెప్పేవాళ్లను అప్పటి క్రికెటరర్లు చెబుతుంటారు. ఆర్య సినిమా టైపులో వన్‌సైడ్‌గా సోనాలి బింద్రేను అక్తర్ ప్రేమించారు. తన మనసులో మాట ఎప్పుడూ చెప్పకపోయినా ఒప్పుకోకుంటే మాత్రం కిడ్నాప్ చేస్తానంటూ సరదాగా కామెంట్ చేసేవాడట.
సోనాలి బింద్రే , అక్తర్ ప్రేమ ఖహానీపై అప్పట్లో మీడియాలో కథనాలు కూడా వచ్చేవి. వీటి గురించి బింద్రేను అడిగితే పుకార్లని కొట్టిపారేసేవారు. ఎంత వరకు నిజమో కాదో తెలియదు కానీ… ఈ విషయం తన కూడా విన్నట్టు ఆమె చెప్పేవాళ్లు. చాలా మందితో ప్రేమలో ఉన్నట్టు ఫేక్ వార్తలు వచ్చాయని ప్రతీదానికి స్పందించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చే వాళ్లు.
బింద్రే నుంచి అలాంటి ఆలోచన లేకపోయినా అక్తర్‌కి మాత్రం ఆమె అంటే క్రష్ ఉండేది. ఎంతలా అంటే తన పర్స్‌లో కూడా సోనాలి బింద్రే ఫొటో పెట్టుకున్నంత అన్నమాట. మొత్తానికి తన ప్రేమను అక్తర్ ఎప్పుడూ వ్యక్తం చేయలేదు. అలాగని మీడియా ముందు కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఇలా అక్తర్ వన్‌సైడ్‌లవ్ అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు తీపి జ్ఞాపకంలా మిగిసిపోయింది.
పాకిస్థాన్ తరఫున వన్డే, టెస్టు, టీ ట్వంటీ మూడు ఫార్మాట్స్‌లో ఆడిన అక్తర్ ఫాస్టెస్ట్ బౌలర్‌గా పేరు సంపాదించారు. తన కెరీర్‌లో 46 టెస్టులు, 163 వన్డే, 15 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 82 ఇన్నింగ్స్‌లు ఆడారు. 178 వికెట్లు పడగొట్టాడు. వన్డల్లో 162 ఇన్నింగ్స్‌లు ఆడి… 247 వికెట్లు తీశాడు. 15 T20ల్లో 19 వికెట్లు తీసుకున్నాడు,