ఐపీఎల్ 2025 సీజన్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికోసం ఆయా జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఎవరికి వారే 2025 ట్రోఫీ తమదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లోని పలు జట్లలో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఆయా జట్ల కెప్టెన్లు చేంజ్ అయ్యారు. కొత్త కెప్టెన్లతో పలు టీంలు సిద్ధంగా ఉన్నాయి.
ఇందులో భాగంగానే కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ నేతృత్వంలో లక్ నవూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక తేడాది నవంబర్లో జరిగిన మెగా వేలంలో రిషబ్ పంత్ భారి స్థాయిలో కొనుగోలు చేయబడ్డాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 27 కోట్లకు లక్నో దక్కించుకుంది. అంతకుముందు అతడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు.
ఇప్పుడు లక్నో కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే అతడి కంటే ముందు నికోలాస్ పూరన్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. కానీ పంత్ ఎంట్రీ తో అవన్నీ పటాపంచలు అయ్యాయి. ఇదిలా ఉంటే మ్యాచ్ 24 న లక్నో వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే తమ జట్టు కెప్టెన్ పై నికోలస్ పూరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జట్టు తరఫున రిషబ్ పంత్ కు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపాడు. అంతేకాకుండా ఈ సీజన్ విన్నర్ గా నిలిచేలా లక్నో జుట్టు సమతుల్యంగా ఉందని అన్నాడు. ఈ సీజన్ తమకు మంచి అవకాశం అని.. తమ జట్టులో అనుభవజ్ఞులు, యంగ్ ప్లేయర్స్ ఉన్నారని అన్నాడు.
అలాగే రిషబ్ పంతుకు నైపుణ్యం, టాలెంట్, ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. అతడు ఎలా రానిస్తాడో గమనించేందుకు తామంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. పంతకు తమ జట్టు తరుపున 100% మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.