punjab kings: పంజాబే ‘కింగ్స్’.. నాలుగో ఓటమి మూటగట్టుకున్న చెన్నై జట్టు

ఐపీఎల్ 18వ సీజన్లో సీఎస్కే వరుసగా నాలుగో పరాజయం మూటగట్టుకుంది. నిన్న పంజాబ్ వర్సెస్ చెన్నై జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 18 పరుగులు తేడాతో సీఎస్కే ను ఓడించింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య చెలరేగిపోయాడు. ఎవరూ కనివిని ఎరుగని రీతిలో సీఎస్కే బౌలర్లకు దడ పుట్టించాడు. 42 బంతుల్లో 103 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. మొదటినుంచి తడబడుతూ వచ్చింది. 8 ఓవర్లకే సగం ప్లేయర్లు పెవిలియన్ బాట పట్టారు. అప్పటికి 85 పరుగులే ఉన్నాయి. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఎట్టకేలకు చెన్నై జట్టు మళ్లీ పుంజుకుందని అంతా అనుకున్నారు. రెండో ఓవర్ లోనే ప్రభు సిమ్రాన్ ఔట్ అయ్యాడు.

ఆ తర్వాత వరుసగా శ్రేయస్ అయ్యర్ తొమ్మిది పరుగులు, స్టయినిస్ నాలుగు పరుగులు, వదేరా 9 పరుగులు, మ్యాక్స్వెల్ ఒక పరుగు చేసి అవుట్ అయ్యారు. అయినా పంజాబ్ జట్టు 219 పరుగులు చేసింది. దానికి ప్రధాన కారణం యువ ఓపెనర్ ప్రియంస్ ఆర్య. అతడు విధ్వంసకర బ్యాటింగ్ తో సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఫోర్లు సిక్సర్లతో గుబులు పుట్టించాడు. సంచలన షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 19 బంతులకే హాఫ్ సెంచరీ చేసేసాడు. ఎనిమిది ఓవర్లకే పంజాబ్ కింగ్స్ సగం వికెట్లు కోల్పోయినా.. ఆర్య తన విధ్వంసకర బ్యాటింగ్ను ఆపలేదు. ఆ తర్వాత 39 బంతుల్లోనే సెంచరీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇలా పంజాబ్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో 219 పరుగులు చేసింది.

ఈ పరుగుల లక్ష్య చేధనకు దిగిన సీఎస్కే జట్టు మొదట్నుంచి మంచి ఆరంభ అందించింది. డెవాన్ కాన్వే 49 బంతుల్లో 69 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర 23 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. శివం దుబే 27 బంతుల్లో 42 పరుగులు సాధించాడు. ఇలా భారీ స్కోర్ తో ముందుకు సాగినా సీఎస్కే జట్టుకు ఓటమి తప్పలేదు.

మొదట పరుగులు ఇచ్చిన పంజాబ్ జట్టు.. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వికెట్లు తీస్తూ పరుగుల వరదను ఆపింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో మ్యాచ్ను సొంతం చేస్తుంది. సీఎస్కే జట్టు చేజింగ్లో నిర్దేశించిన 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి 201 పరుగులు చేసింది. ఇలా 18 పరుగుల తేడాతో ఓటమి బాట పట్టింది.

తరవాత కథనం