RCB కొత్త కెప్టెన్‌ రజత్ పాటిదార్ పై కోహ్లీ సంచలన వీడియో రిలీజ్..!

త్వరలో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్సిబికి కొత్త కెప్టెన్ ను పరిచయం చేసింది. తమ కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదారును నియమించింది. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పై ఆసక్తి చూపించకపోవడంతోనే యాజమాన్యం పాటిదార్ పేరును అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ప్రకటన అనంతరం ఆర్సిబి కొత్త కెప్టెన్ రజత్ పాటిదారును కోహ్లీ ప్రశంసించాడు. ఈ మేరకు అతడికి శుభాకాంక్షలు చెప్పాడు. ఆర్సిబికి చాలామంది కెప్టెన్సీ వహించారని.. ఇప్పుడు ఆ బాధ్యత రజత్ పాటిదార్ వహించబోతున్నాడని తెలిపాడు. కెప్టెన్సీ అనేది పెద్ద బాధ్యత అయినప్పటికీ.. తామంతా అతడికి మద్దతుగా నిలుస్తామని అన్నాడు. గతంలో ఎలాగైతే కెప్టెన్లు జట్టును ముందుకు నడిపించారో.. ఇప్పుడు పాటిదార్ కూడా అలానే ముందుకు నడిపిస్తాడని తాను ఆశిస్తున్నట్లు తెలిపాడు.

టీంలో ప్రతి ఒక్కరూ అతనికి మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నాడు. కెప్టెన్ గా తాను చాలా ఏళ్లు ఉన్నానని.. తన తర్వాత డూప్లెసిస్ గత రెండేళ్లు టీం ని ముందుకు నడిపించాడని అన్నాడు. ఇప్పుడు ఆ బాధ్యత రజత్ పాటిదార్ నిర్వర్తిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇది అతడు దక్కిన గొప్ప గౌరవంగా తను భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ సీజన్ ను పాటిదర్ కెప్టెన్సీలో అద్భుతంగా ప్రారంభిస్తామని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నాడు.

తరవాత కథనం