CSK VS RCB: 17 ఏళ్ల తర్వాత చెన్నైపై బెంగళూరు విజయం

csk vs rcb

17 ఏళ్ల తర్వాత చెన్నై పై ఆర్సిబి ఘనవిజయం సాధించింది. ఎప్పుడో 2008లో ఐపీఎల్ ఆరంభ సీజన్ లో.. అది కూడా రాహుల్ ద్రావిడ్ సారధ్యంలో చెన్నై పై బెంగళూరు తొలి విజయం సాధించింది. అదే తనకి ఆఖరి విజయమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతోమంది కెప్టెన్లు మారారు. ప్లేయర్లు మారారు. కానీ చెన్నై స్టేడియంలో rcbకి మాత్రం విజయం రాలేదు.

అయితే ఎట్టకేలకు ఆ జట్టు నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ 2025 సీజన్ లో 8వ మ్యాచ్ చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సిబి జట్టు ఘన విజయం సాధించింది. దాదాపు 50 పరుగుల తేడాతో సీఎస్కే ను మట్టిగరిపించింది.

మొదట టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టు బ్యాటింగ్ దిగింది. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, పిల్ సాల్ట్ క్రీజులోకి వచ్చారు. మొదటినుంచి దూకుడుగా ఆడారు. కానీ వరుస వికెట్లు పడడంతో తక్కువ స్కోరుకే బెంగళూరు పరిమితమైంది. విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు.

పిల్ సాల్ట్ 16 బంతుల్లో 32 పరుగులు సాధించాడు. కెప్టెన్ రజిత పాడిదార్ 32 బంతుల్లో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. పడిక్కల్ 14 బంతుల్లో 27 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇలా బెంగళూరు జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు, పతిరన్ 2 తో ఆకట్టుకున్నారు.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన సీఎస్కే మొదటి నుంచి మంచి ఆరంభం అందించింది. కానీ అది ఎక్కువసేపు నిలవలేకపోయింది. మొదటి ఓవర్ లోనే త్రిపాఠి 5 పరుగులకు అవుట్ అయ్యాడు. అదే ఓవర్ లో కెప్టెన్ రుతురాజు గైక్వాడ్ కూడా డక్ ఔట్ గా నిలిచాడు. అలా దీపక్ కూడా 4 పరుగులు, శ్యాంకరణ్ 8 పరుగులు మాత్రమే సాధించారు.

దీంతో స్టార్ బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో చెన్నైకి భారంగా మారింది. ఆ తర్వాత జడేజా, ఎంఎస్ ధోని క్రీజ్ లో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. బాల్స్ అండ్ రన్స్ మధ్య చాలా వ్యత్యాసం ఉండడంతో విజయం చేజారిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. దీంతో బెంగళూరు జట్టు 50 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి టాప్ ప్లేస్ లో ఉంది.

తరవాత కథనం