రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఖాతాలో మరో విజయం పడింది. తమ సొంత గడ్డపై ఆడిన రెండు మ్యాచ్లు ఓడిపోయిన ఆర్సిబి జట్టు.. పొరుగు గడ్డపై దుమ్ము దులిపేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రాజస్థాన్ ను జైపూర్ లో చిత్తుచిత్తు చేసింది. దీంతో నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాదాపు తొమ్మిది వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. తమ జట్టు విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ, ఫీల్ సాల్ట్ ముఖ్యపాత్ర పోషించారు.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్ ఆర్ జట్టు ఇంత పెద్ద స్కోరు చేయడానికి ముఖ్య కారణం యశస్వి జైష్వాల్. అతడు 47 బంతుల్లో 75 పరుగులు రాబట్టాడు. ఆ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోయాడు. కెప్టెన్ సంజు సాంసన్ 19 బంతుల్లో 15 పరుగులు రాబెట్టాడు.
రియాన్ పరాగ్ 22 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అయితే జైస్వాల్, పరాగ్ వెంట వెంటనే అవుట్ కావడంతో స్కోర్ మొత్తం డీలా పడిపోయింది. ఆ తర్వాత ధ్రువ్ జూరెల్ పరుగులు వరద రాబెట్టాడు. అతడు 23 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇలా మొత్తంగా రాజస్థాన్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
దీంతో 174 పరుగుల లక్ష్య చేదనకు దిగిన బెంగళూరు జట్టు అదరగొట్టేసింది. మెరుపు షాట్లతో కోహ్లీ, సాల్ట్ చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఫీల్ సాల్ట్ 33 పంతుల్లో 65 పరుగులు రాబట్టే టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడు ఔట్ అయిన తర్వాత పడికల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి విధ్వంసం సృష్టించాడు.
ఓవైపు విరాట్ కోహ్లీ, మరోవైపు పడిక్కల్ చెలరేగి ఆడటంతో విజయం సొంతమైంది. విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పైడికల్ కూడా 28 బంతుల్లో 41 పరుగులు చేసి నాట్ అవుట్ గా మిగిలాడు. ఇలా కేవలం ఒక వికెట్ నష్టానికి బెంగళూరు జట్టు లక్ష్యాన్ని చేదించి విజయం అందుకుంది.