ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలి మ్యాచ్‌తో టీమిండియా శుభారంభం చేసింది. బంగ్లా పై ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా ఆదిలోనే కుప్ప కూలిపోయింది.
మొదట ఓవర్ షమీ వేయగా తొలి వికెట్ పడింది. ఆ తర్వాత ఓవర్ హర్షిత్ రానా వేయగా మరో వికేట్ కోల్పోయింది. ఇలా పట్టుమని పది ఓవర్లు కాకముందే కేవలం 35 పరుగులకే బంగ్లా ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో పరాజయం లాంచనమే అని అనిపించింది. భారత్ బౌలర్ల ధాటికి బంగ్లా వణికిపోయింది. మహమ్మద్ షమీ స్పీడ్ కు తట్టుకోలేకపోయింది.
ఇక బంగ్లా బ్యాటర్ హృదయ్ చెలరేగి ఆడాడు. 100 పరుగులు చేసి ఔరా అనిపించాడు. జేకర్ అలీ 68 పరుగులు చేశాడు. మొత్తంగా బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక లక్ష్య చేదనకు దిగిన భారత్ మొదటి నుంచి మంచి ఫామ్ కనబరుస్తూనే వచ్చింది.
ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ అదరగొట్టేసారు. రోహిత్ 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గిల్ మాత్రం పట్టు విడవని విక్రమార్కుడిలా తన ఆట తీరు కనబరిచాడు. నాలుగు వికెట్లు కోల్పోయినా ఎక్కడ భయపడకుండా భారత్ ను విజయపథం వైపు నడిపించాడు. కొట్టాల్సిన దగ్గర కొట్టాడు, తగ్గాల్సిన దగ్గర తగ్గాడు.
ఇక గిల్ కు కేఎల్ రాహుల్ తోడవడంతో టీమిండియా విజయం సాధించింది. గిల్ 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రాహుల్ 41 పరుగులు చేశాడు. చివరి వరకు ఉండి 46 ఓవర్లలో గిల్, రాహుల్ ఆటను ముగించారు. ఇక బౌలర్ల విషయానికొస్తే మహమ్మద్ షమీ ఇరగదీసేసాడు. ఐదు వికెట్లు తీసి అదరగొట్టేసాడు. హర్షిత్ రానా మూడు వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లతో చెలరేగారు. మొత్తంగా బంగ్లా నిర్దేశించిన 229 పరుగులను ఛేదించారు.