Gongadi Trisha: తెలుగు క్రికెటర్ త్రిషకు సూపర్ ఆఫర్.. ఐసీసీ జట్టులో స్థానం!

GONGADI TRISHA

ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో భారత క్రీడాకారిని, తెలంగాణ ప్లేయర్ గొంగడి త్రిష దుమ్ము దులిపేసింది. ముఖ్యంగా చివరి మ్యాచ్‌లో ఆమె బ్యాటింగ్ తీరు అదరహో అనిపించింది. ఆమెకు తాజాగా మరో ముందడుగు వేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మహిళల అండర్‌-19 టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన జట్ల నుంచి కొందరి ప్లేయర్లను ఐసీసీ ఎంపిక చేసింది.

అందులో నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. ఈ నలుగురిలో అద్భుతమైన ప్రదర్శన చేేసిన తెలుగమ్మాయి గొంగడి త్రిషకి అవకాశం దక్కింది. ఆమెతో పాటు కమలిని, వైష్ణవి, ఆయూషి ఈ జట్టులో స్థానం దక్కింది. ఈ కప్‌లో గొంగడి త్రిష 147పైన స్ట్రైక్‌రేట్‌తో 309 పరుగులు చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా సెలెక్ట్ అయింది. స్కాట్లాండ్‌పై శతకం కొట్టి దుమ్ము దులిపేసింది. అది  మాత్రమే కాకుండా ఈ కప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా త్రిష రికార్డు క్రియేట్ చేసింది.

త్రిషకు చోటు దక్కడంపై భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష చాలా వైవిధ్యమైన క్రికెటరని అని ఆమె అన్నారు. త్రిషకు సీనియర్‌ స్థాయిలో ఆడే సత్తా ఉందని తెలిపింది. ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ నిలబెట్టుకోవడంలో త్రిష కీలకపాత్ర పోషించిందని ఆమె  పేర్కొంది.

ఈ మేరకు చిన్న పిల్లగా ఉన్నప్పుడే త్రిష ఆట చూస్తే ముచ్చటగా అనిపించిందని ఆమె తెలిపింది. ప్రస్తుత క్రికెట్లో ఆల్‌రౌండర్ల అవసరం ఎంత ఉందో చెప్పడానికి ఇటీవల మ్యాచ్లో త్రిష ప్రదర్శనే ఉదాహరణ అని చెప్పుకొచ్చింది. లైన్‌ అండ్‌ లెంగ్త్‌పై త్రిషకు మంచి పట్టు ఉందని తెలిపింది. బ్యాటింగ్‌లో కూడా తానేంటో ఇప్పటికే నిరూపించుకుందని చెప్పింది.

త్రిష త్వరలోనే టీమిండియా సీనియర్‌ జట్టుకు ఆడాలని కోరుకుంటున్నా.. దాన్ని నిలదొక్కుకుని రాణించాలని ఆమె తెలిపింది. కాబట్టి ఆమెకు ఆ సత్తా ఉందని భావిస్తున్నా అని చెప్పుకొచ్చింది.  ఈ మేరకు ప్రస్తుత జూనియర్‌ ప్లేయర్లు ఎంతో ప్రతిభావంతులని ఆమె ప్రశంసించారు.

తరవాత కథనం