ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి అంత సిద్ధమైంది. పాకిస్తాన్ ఆతిథ్యంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుజట్లు తమ స్క్వాడ్ లను ప్రకటించాయి. అయితే భారత్ మాత్రం పాకిస్తాన్ వెళ్ళేది లేదని తేల్చి చెప్పింది. దీంతో భారత్ మ్యాచులు దుబాయిలో జరగనున్నాయి.
ఫిబ్రవరి 19 నుంచి ఈ మ్యాచ్‌లు గ్రాండ్ లెవెల్ లో ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ప్రపంచమంతా భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంది. ఫిబ్రవరి 23న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రోహిత్ శర్మకు కొన్ని సూచనలు చేశాడు.
ఈ మేరకు హర్బజన్ సింగ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ క్రికెటర్ ఫకర్ జమాన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫకర్ జమాన్ కు భారత్ నుంచి గెలుపును దూరం చేసిన అనుభవం ఉంది అని అన్నాడు. అందువల్ల అతడితో చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన విజయ అవకాశాలను అతడు దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఫకర్కు వన్డేల్లో భారత్ పై మంచి రికార్డు ఉందని అన్నాడు.
ఇదిలా ఉంటే దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచుల గురించి పలువురు మాజీలు తమ అంచనాలను వెల్లడించారు. ముఖ్యంగా దాయాదుల మధ్య జరిగే పోరులో అద్భుతమైన ఆట ప్రదర్శన చేసే ఆ ప్లేయర్ ఎవరో వెల్లడించారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. మ్యాచ్ లో ఏ ఆటగాడు కీలకంగా మారుతాడు అన్న ప్రశ్నకు.. అతడు హార్దిక్ పాండ్యా పేరు చెప్పాడు. అలాగే ఆఫ్రిద్ రిజ్వాన్ పేరును చెప్పాడు. ఇంజమామ్.. ఫకర్ జమాన్ పేరును సూచించాడు.