భారత్ -ఇంగ్లండ్ మధ్య టీ 20 సిరీస్ నిన్నటితో ముగిసింది. ఈ సిరీస్ ను టీమిండియా సొంతం చేేసుకుంది. 4-1 తేడాతో గెలిపొందింది. అయితేే ఈ టీ20 సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ తీవ్ర వివాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పుడంతా ఇదేే చర్చ నడుస్తోంది. కంకషన్ సబ్‌స్టిట్యూట్ నిర్ణయం తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నాలుగో టీ20 మ్యాచ్‌లో శివమ్ దూబె ప్లేస్‌లో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌గా రావడంపై వివాదం మొదలైంది.
హర్షిత్ రాణా గ్రౌండ్ లోకి రావడమే కాకుండా మూడు వికెట్లు తీసి ఆ మ్యాచ్ భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణా నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీలు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ఈ మేరకు అది సరైన కంకషన్ రిప్లేస్‌మెంట్ కాదని వారు అంటున్నారు. ఎట్టకేలకు ఈ వివాదంపై టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్ట్ అయ్యాడు.
ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఐదో టీ20 మ్యాచ్ అనంతరం అతడికి కంకషన్ రిప్లేస్‌మెంట్ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందించాడు. శివమ్ దూబె ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసేవాడని.. కానీ ఆ అవకాశం అతడికి రాలేదని అన్నాడు. అతడు వేసిన రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు తీశాడని అని గంభీర్ పేర్కొన్నాడు. అయితే అతడు ఈ వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది. మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో అతడు చేసిన ‘ఇంపాక్ట్’ కామెంట్లకు గంభీర్ కౌంటర్ ఇచ్చినట్లైంది.
అనంతరం అతడు మాట్లాడుతూ.. ఇంగ్లండ్ అత్యంత బలమైన జట్టు అని అన్నాడు. అయితే ఏదో ఒక మ్యాచ్‌లో తమ టీం ఓడిపోయినా భయపడలేదని.. ప్రతి మ్యాచ్‌లోనూ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించామని చెప్పుకొచ్చాడు. ఇక కొన్నిసార్లు 120కే ఆలౌటైన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నాాడు. అభిషేక్ శర్మ లాంటి యువ క్రికెటర్లకు మద్దతుగా ఉండాలని చెప్పుకొచ్చాడు. అభిషేక్ సెంచరీ కంటే మరొక అత్యుత్తమ శతకం లేదనిపిస్తోందని గంభీర్ వ్యాఖ్యానించాడు.
అయితే ఎప్పుడైతేే ఫలితం మనకు అనుకూలంగా వస్తుందో అప్పుడు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుందని అన్నాాడు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, బౌలింగ్ జట్టుకెంతో ముఖ్యమని.. బ్యాటింగ్‌లో టాప్ -7 బ్యాటర్లు దూకుడుగా ఆడాలని తాము కోరుకుంటామని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే దూకుడైన ఆటతీరును వన్డేల్లోనూ కొనసాగించాలని భావిస్తున్నాం అని గంభీర్ చెప్పుకొచ్చాడు.