Boxing Day Test: బ్యాట్లు ఎత్తేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్- బాక్సింగ్ డే టెస్టులో ఓటమి

Team India

ఏమాత్రం పోరాటం చేయలేదు. ఒక్క జైస్వాల్ మినహా ఎవరూ ఓపికతో బ్యాటింగ్ చేసినట్టు కనిపించలేదు. గెలుపు విషయం పక్కన పెడితేకనీసం డ్రా చేద్దామన్న ఆలోచన లేకుండా ఆడారు. టీ బ్రేక్ వరకు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత టపటపా వికెట్లు కోల్పోయింది. మొత్తానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లో ఆడుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓటమిపాలైంది.

మెల్‌బోర్న్ టెస్టులో నాల్గో టెస్టు ఆఖ‌రి రోజు ఆటను ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 228పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ప్రారంభించింది. స్కోర్‌కు మరో ఆరు పరుగుల జోడించి ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌ ముందు 340 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

340 పరుగుల లక్ష్య చేధనతో రెండో ఇన్నింగ్స్ ప్రాంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తలిగింది. కేవలం 9 పరుగుల మాత్రమే చేసిన రోహిత్ శర్మ ప్యాట్‌ కమ్మిన్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్ బాటపట్టాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ ఎలాంటి పరుగుల చేయకుండానే కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ అవుట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. మరోసారి ఆఫ్‌సైడ్‌ బంతికే అవుట్ అయ్యాడు. కేవంల ఐదు పరుగులే చేశాడు. దీంతో 33 పరుగులకే భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది.

లంచ్‌ విరామం తర్వాత ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ పంత్‌తో కలిసి దూకుడుగా ఆడారు. వీళ్లిద్దరు టీ బ్రేక్ వరకు మంచి భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ క్రమంలోనే జైశ్వాల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్‌ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా 112 పరుగులు చేసింది. అప్పటికి టీమిండియా విజయానికి 228 పరుగులు అవసరం అయ్యాయి. ఇంకా 7 వికెట్లు చేతిలో ఉన్నాయి.

టీ బ్రేక్‌ సమయానికి ఉన్న పరిస్థితి బట్టి చూస్తే…. దూకుడుగా ఆడితే కచ్చితంగా భారత్ గెలుస్తుందని అందుకున్నారు. లేకుంటే కనీసం డ్రా అయిన అవుతుందని అనుకున్నారు. ఆ తర్వాతే కథ మారిపోయింది. జైశ్వాల్‌, రిషబ్‌ పంత్‌ భాగస్వామ్యాన్ని ట్రవిస్‌ హెడ్‌ విడగొట్టాడు. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్‌ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన జడేజా కూడా నిలదొక్కుకోలేకపోయాడు. స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో ఐదో వికెట్‌ రూపంలో వెనుదిరగాడు.

జడేజా అవుట్ తర్వా క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్‌ రెడ్డి చుట్టూ వ్యూహం పన్నిన ఆస్ట్రేలియా అతన్ని కేవలం ఒక పరుగుకే పెవిలియన్ పంపించింది. నాథన్‌ లియాన్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి నితీశ్‌ అవుట్ అయ్యాడు.

ఓవైపు వికెట్లు పడుతున్నా అప్పటి వరకు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేసిన జైశ్వాల్ గతితప్పాడు. నితీష్ అవుట్ తర్వాత ఏడో వికెట్ రూపంలో జైశ్వాల్‌ వెనుదిరిగాడు. 84 పరుగులు చేసిన స్టార్క్‌ బౌలింగ్‌లో వివాదాస్పద రీతిలో ఇన్నింగ్స్‌ ముగించేశాడు.

తర్వాత 150 పరుగుల వద్ద భారత్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది.17 బంతుల్లో ఏడు పరుగులు చేసి ఆకాశ్‌దీప్ ఔటయ్యాడు. కాసేపటికే  బుమ్రా వికెట్‌ను భారత్ కోల్పోయింది. ఈ వికెట్‌ను బోలాండ్ తీశాడు. పదో వికెట్‌గా వాషింగ్టన్ సుందరన్‌ వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో విజయం సాధించింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. బ్యాటింగ్ బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా బాక్సింగ్ టెస్టులో భారీ విజయాన్ని నమోదు చేసింది. కమిన్స్, బోలాండ్ చెరో  3 వికెట్లు తీశారు. ఐదో టెస్టు మ్యాచ్‌  జనవరి మూడు నుంచి సిడ్నీలో జరగనుంది.

తరవాత కథనం