IND vs ENG, T20 Series:కొత్త నాయకుల కోసం వెతుకుతున్న బీసీసీఐ – కీలక విషయాలు చెుతున్న ఇంగ్లాండ్‌తో టీ20 జట్టు ఎంపిక

BCCI

IND vs ENG, T20 Series: రిషబ్ పంత్, హార్దిక్‌కు షాక్  నిరాశపరిచాడు, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ అయ్యాడు… ఇంగ్లాండ్‌తో టీ20 జట్టు ఎంపిక గురించి పెద్ద విషయాలు
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును శనివారం (జనవరి 11) ప్రకటించారు. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు.

వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్
టీ20 సిరీస్‌కు జట్టు ఎంపికలో చాలా అనూహ్య నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా చేశారు. అక్షర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ల సందర్భంగా భారత జట్టులో వైస్ కెప్టెన్ లేకపోవడం గమనార్హం. శ్రీలంక సిరీస్‌లో శుభ్‌మన్ గిల్‌కు ఈ బాధ్యత ఇచ్చారు. హార్దిక్ పాండ్యా కూడా జట్టులో ఉన్నప్పటికీ అక్షర్ పటేల్‌కు ప్రాముఖ్యత ఇవ్వడం సెలెక్టర్లు నాయకత్వ పాత్ర కోసం ఇతర ఎంపికలను పరీక్షించాలనుకుంటున్నారని సూచిస్తుంది.

రిషబ్ పంత్ జట్టులో భాగం కాదు
వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌ను టీ20 జట్టులోకి రీఎంట్రీ చేసినా రిషబ్ పంత్‌కు చోటు దక్కలేదు. గత ఏడాది శ్రీలంక పర్యటనలో పంత్ తన చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. 15 మంది సభ్యుల జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్‌గా జురెల్‌ని చేర్చగా, సంజూ శాంసన్‌ను ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్‌గా జట్టులో ఎంపిక చేశారు. జింబాబ్వే పర్యటనలో జురెల్ భారత్ తరఫున 2 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిని కూడా టీ20 జట్టులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టులో ఉన్నారు. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. ఈ ఆటగాళ్లు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టులో ఉండే అవకాశం ఉంది.

14 నెలల తర్వాత చట్టులోకి మహ్మద్ షమీ
అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి వచ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత షమీ జట్టుకు దూరమయ్యాడు. 34 ఏళ్ల మహ్మద్ షమీ దాదాపు 14 నెలల తర్వాత భారత జట్టులోకి వచ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత షమీకి శస్త్రచికిత్స జరిగింది. ఎడమ మోకాలి వాపు కారణంగా షమీ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యాడు.

దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లొచ్చిన ఐదుగురు అవుట్
దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ రమణదీప్ సింగ్, వికెట్ కీపర్ జితేష్ శర్మ, విజయ్‌కుమార్ వైషాక్, యశ్ దయాల్, అవేశ్ ఖాన్‌కు నిరాశ తప్పలేదు. ఈ ఐదుగురు ఆటగాళ్లను కూడా జట్‌టులోకి తీసుకోలేదు. ఆఫ్రికా టూర్‌లో రైట్ ఆర్మ్ పేసర్లు అవేశ్ ఖాన్, రమణదీప్ సింగ్ బాగానే ఫెర్‌ఫామ్ చేశారు. కానీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యశ్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ విజయ్ కుమార్, జితేష్ శర్మ మ్యాచ్‌లే ఆడలేదు.

నలుగురు స్పిన్ బౌలర్లు
భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలమైనవిగా చెబుతారు. అందుకే టీ20 సిరీస్ కోసం నలుగురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకున్నారు. ఇందులో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ కు చోటు దక్కింది. అక్షర్, సుందర్ బ్యాట్స్‌మెన్‌గా కూడా రాణిస్తారు. అందువల్ల వారితో టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా మారుతుందని భావిస్తున్నారు.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).

భారత పర్యటనలో, ఇంగ్లాండ్ జట్టు మొదట 5 T20 మ్యాచ్‌లు ఆడుతుంది. జనవరి 22న కోల్‌కతాలో తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 తర్వాత భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇదే వన్డే ఫార్మాట్‌లోనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిరీస్ ఇరు జట్లకు ప్రాక్టీస్‌గా మారనుంది. ఈ సిరీస్‌లోని తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో జరగనుంది.

భారత్‌లో ఇంగ్లండ్‌ పర్యటన
1వ టీ20- 22 జనవరి- కోల్‌కతా
రెండో టీ20- 25 జనవరి- చెన్నై
మూడో టీ20- 28 జనవరి- రాజ్‌కోట్
నాలుగో టీ20- 31 జనవరి- పూణె
ఐదో టీ20- 2 ఫిబ్రవరి- ముంబై
1వ వన్డే- ఫిబ్రవరి 6-నాగ్‌పూర్
రెండవ వన్డే – 9 ఫిబ్రవరి – కటక్
మూడో వన్డే- 12 ఫిబ్రవరి- అహ్మదాబాద్

తరవాత కథనం