ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి మ్యాచ్లు జరగనున్నాయి. దీనికోసం పలు జట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అందులో భారత జట్టు ఒకటి. ఫుల్ ఫామ్ లో ఉన్న టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్ల కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలుస్తుందని అతడు జోష్యం చెప్పాడు. అంతేకాకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం రికార్డులు క్రియేట్ చేస్తాడని తెలిపాడు. ఈ ట్రోఫీలో రోహిత్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటరుగా నిలుస్తాడని అతడు వ్యాఖ్యానించాడు.
అతడు ఫామ్ లోకి వచ్చాడు అంటే ఆపడం ఎవరి తరం కాదని అన్నారు. ఇటీవల ఇంగ్లాండు తో జరిగిన సిరీస్ లో అతడు ఫామ్ అందుకోవడం టీమ్ ఇండియాకు కలిసొచ్చిన అంశం అని అన్నాడు. అదే సమయంలో జట్టు పరంగా ఇంగ్లాండ్ కు టైటిల్ సాధించే అవకాశాలు తక్కువేనని ఆయన అన్నాడు. అందులో జోఫ్రా ఆర్చర్ టాప్ వికెట్ టేకర్ గా అవుతాడని అతడు భావించినట్లు తెలిపాడు.
అలాగే ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలుస్తాడనుకుంటున్నట్లు అతడు తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ లో తన ఫామ్ కొనసాగిస్తాడని తాను ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇక విరాట్ కోహ్లీ ముంగిట మరో రికార్డు ఉందని అన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో 13 మ్యాచుల్లో 529 పరుగులు చేశాడని.. మరో 263 పరుగులు చేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అతడు అవతరిస్తాడు అని అన్నారు.