ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ vs పాకిస్తాన్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఉత్కంఠ పోరు లేకపోయినప్పటికీ విరాట్ కోహ్లీ సెంచరీ తీరు మాత్రం ఎంతో ఆసక్తికరంగా మారింది. అతడి ఆట ప్రపంచ క్రికెట్ ప్రియులను, మాజీ ఆటగాళ్లను సైతం ఫిదా చేసింది. ఏకంగా పాకిస్తాన్ ప్లేయర్లే కోహ్లీ ఆటకు సెల్యూట్ చేశారు. దాదాపు 6 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. ఆదిలోనే అంతమైనట్లు కనిపించింది. పడి పడి లేచే కెరటంలా ఆ జట్టు మారింది. 47 పరుగులకు రెండు వికెట్లు కోల్పోవడంతో కాస్త కంగారు పడ్డారు. కానీ అక్కడ నుంచి ఒక్క వికెట్ పడకుండా 130కి పైగా పరుగులు చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా పెవిలియన్కు చేరారు.
ఇలా మొత్తంగా 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు. అందులో సౌద్ షకీల్ 76 బంతుల్లో 62 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక పాక్ నిర్దేశించిన స్కోర్ ను ఛేదించేందుకు భారత్ క్రైజ్ లోకి దిగింది. మొదట ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, గిల్ మంచి ఫామ్ కనబరిచారు. ఇక రోహిత్ ఔట్ అయిన తర్వాత రంగంలోకి దిగిన కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు.
ఎక్కడ భయం భీతి లేకుండా భారత్ ను విజయపథంలో నడిపించాడు. మరోవైపు గిల్ ఫోర్లు, సిక్సర్లతో మెరిపించాడు. ఇక గిల్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ వచ్చాడు. అతడు కూడా అద్భుతమైన ఆట తీరు కనబరుస్తూ హాఫ్ సెంచరీ చేశాడు. ఇలా వచ్చిన వారు వచ్చినట్టుగానే కొట్టుకుంటూపోయారు.
ఎలాగైనా పాటిస్తాన్ ను మట్టికరి పెంచాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. ఎక్కడా పెద్ద షాట్లు ఆడకుండా బాల్ టు బాల్ పరుగులు చేశాడు. ఇలా మొత్తంగా 100 పరుగులు రాబట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. దీంతో భారత్ విజయం సాధించింది. కేవలం 42.3 ఓవర్లలోనే చేదించింది. ఇక భారత్ vs న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ మార్చ్ 2 న జరగనుంది.