విరాట్ కోహ్లీ తన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ అందించాడు. ఇప్పటికే టి20లో రిటర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. మళ్లీ తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటానని అన్నాడు. దీంతో విరాట్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశాడు.
2028 లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చనున్నారు. అప్పుడు భారత్ t20 ఫైనల్ కు చేరితే తాను తన రిటైర్మెంట్ ను వెనక తీసుకుని ఆడతానని అన్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ఒలింపిక్స్ నేపథ్యంలో టి20 రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటారా అనే ప్రశ్నకు.. తీసుకోను.. ఒకవేళ ఒలింపిక్స్ లో భారత్ t20 ఫైనల్ కు చేరితే ఆ ఒక్క మ్యాచ్ కోసం తన రిటైర్మెంట్ వెనక తీసుకుని ఆడుతానని అన్నాడు.
ఒలింపిక్స్ పథకం సాధించడం అదృష్టమే కదా అని చెప్పుకొచ్చాడు. దీంతోపాటు క్రికెటర్గా తన కెరీర్ గురించి మాట్లాడాడు. ముఖ్యంగా వన్డేల్లో తన రిటైర్మెంట్ గురించి స్పందించాడు. ఎవరూ ఆందోళన చెందకండి అని చెప్తూ తాను ఇలాంటి రిటైర్మెంట్ ప్రకటనలు చేయబోవట్లేదని తెలిపాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. క్రికెట్ ను ఆనందంగా ఆస్వాదిస్తున్నాను అని అన్నాడు.
క్రికెట్ పట్ల ప్రేమ తనను ఆనందంగా ఆడేలా చేస్తుంది.. కానీ ఎలాంటి రికార్డుల కోసం కాదని తెలిపాడు. ఎప్పుడు రిటైర్మెంట్ కు వీడ్కోలు చెబుతాము అన్నదానికి సమాధానం కనుక్కోలేమని చెప్పాడు. దీనిపై మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కూడా మాట్లాడానని.. నీ మనసు చెప్పిందే పాటించు అని అతడు తనతో చెప్పాడని కోహ్లీ అన్నాడు. మొత్తానికి ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.