యంగ్ బాట్స్ మాన్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత కొంతకాలంగా ముంబై తరఫున దేశవాళీల్లో ఆడుతున్న అతడు.. సడన్ గా ఆ జట్టుకు వీడ్కోలు పలికాడు. దేశవాళి క్రికెట్ లో ముంబైకి గుడ్ బాయ్ చెప్పి.. ఇకనుంచి గోవా జట్టులో ఆడేందుకు రెడీ అయ్యాడు. ఇందులో భాగంగానే ముంబై క్రికెట్ అసోసియేషన్కు అతడు లేఖ రాశాడు.
గోవాకు మారేందుకు తనకు నిరభ్యంతర పత్రం ఇవ్వాలని అతడు కోరాడు. దీంతో అతడి అభ్యర్థనను జట్టు పాలకవర్గం కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు నేషనల్ మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన పరిణామనీ ఆయన అన్నారు.
అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. అతడి అభ్యర్థన మేరకు జట్టు నుంచి రిలీవ్ చేశామని తెలిపారు. అయితే జైస్వాల్ మాత్రం.. తన వ్యక్తిగత కారణాలతోనే జట్టు మారుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. దీంతో ఈ యంగ్ స్టార్ 2025-26 సీజన్ లో గోవా తరపున దేశాల క్రికెట్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
అయితే దేశవాళీలో ముంబై జట్టును వీడిన మూడో ఆటగాడు జైస్వాల్. గతంలో 2022- 23 సీజన్ సమయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్, అలాగే మరో క్రికెటర్ సిద్దేస్ లాడ్ కూడా ముంబైని వీడి గోవా జట్టుకు వెళ్లారు.
ఇదిలా ఉంటే ఈ తాజా పరిణామాలపై గోవా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సాంబదేసై రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ జైస్వాల్ ను తమ జట్టులోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కాగా జైస్వాల్ 2019లో ముంబై జట్టులో చేరాడు. అప్పట్నుంచి అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. ఇలా దాదాపు 63 మ్యాచ్లు ఆడాడు.