ఉల్లిపాయల గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

ఇంగ్లండ్‌లో పండించిన ఓ రకం ఉల్లిపాయ.. ఒక్కటీ రూ.5 కిలోల బరువుతో రికార్డు సృష్టించిందట.

 ప్రాచీన వైద్యం, ఆయుర్వేద వైద్యంలో ఉల్లిపాయలను ఎక్కువగా వాడేవారట.

చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉల్లిని ఎక్కువగా వాడేవారని మన పెద్దలు చెబుతున్నారు.

చర్మంపై ఉండే బ్యాక్టీరియాను తొలగించే శక్తి సైతం ఉల్లిపాయలకు ఎక్కువే.

పర్పుల్ కలర్‌లో లభించే ఉల్లి పాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి గుండెకు మేలు చేస్తాయి.

 ఉల్లి తొక్కల్లో కూడా ఎన్నో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయంటే నమ్మలేరు కదా.

 ఉల్లిలో ఉండే సల్ఫర్‌.. కండరాలకు అవసరమైన ఆక్సిజన్ నిల్వలను మెరుగుపరుస్తాయి.

ఉల్లిపాయల్లో సుమారు 89 శాతం నీరే ఉంటుందట.